నిజాయితీకి కేరాఫ్ అడ్రస్ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అని, అవినీతికి మాత్రం కేరాఫ్ అడ్రస్ ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. కాగా, ఇవాళ బుద్ధా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ.. విభజన తరువాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పాలనలో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. అలాగే, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గురించి మాట్లాడుతూ.. ఏమయ్యా విజయసాయిరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును జైలుకు పంపిస్తావా..? మతి ఉండే మాట్లాడుతున్నావా..? చంద్రబాబు ఏం చేశాడని జైలుకు పంపిస్తావు..? జగన్‌లా చంద్రబాబు ఏమన్నా అవినీతికి పాల్పడ్డాడా.? లేక హత్యలు చేశాడా..? అంటూ విజయసాయిరెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు బుద్ధా వెంకన్న.
see also : ప్రత్యేక హోదాకు చంద్రబాబు శుద్ధ వ్యతిరేకి..!!
see also : ప్రజాసంకల్ప యాత్రపై హీరో నిఖిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..!!
చంద్రబాబును జైలుకు పంపించడం నీ వల్ల కాదు కదా.. నిన్ను పుట్టించిన వాళ్ల వల్ల కూడా కాదు అంటూ విజయసాయిరెడ్డిని ఉద్దేశించి అన్నారు. 2000లో సంవత్సరంలో స్వయాన జగన్ మోహన్‌రెడ్డి తండ్రి, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి చంద్రబాబుపై అనేక రిట్లువేసి తరువాత ఉపసంహరించుకున్నారన్నారు. ఆ తరువాత వైఎస్ విజయమ్మ చంద్రబాబుపై 26 కేసులు పెడితే వాటన్నింటిలోనూ చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇస్తూ కోర్టులు తీర్పునిచ్చాయని చెప్పారు. ముందు మీ జగన్ మోహన్‌రెడ్డిని జైలు జీవితం నుంచి ఎలా తప్పించాలో ఆలోచించు… ఇప్పటికే 15 నెలలు జైల్లో ఉన్న మీ జగన్ త్వరలో మళ్లీ జైలుకెళ్లడం ఖాయమంటూ విమర్శల వర్షం కురిపించారు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న.