క్రైస్తవ సోదరులకు ప్రధానమైన రోజ్లులో గుడ్‌ఫ్రైడే ఒకటి. పాప్నులి ద్వేషించకు, పాపాల్ని ద్వేషించు అన్న ప్రేమమ్తూరి. ఏసుక్రీస్తును శిలువ వేసిన రోజది. తమ జీవిత నావను నడిపించే ఏసుప్రభువు రక్తపు ధారల మధ్య… ముళ్ళ కంచెల భారంతో… శిలువ వేయబడ్డాడని క్రైస్తవులంతా దుఃఖసాగరంలో మునిగి పోయే రోజది. ఆ రోజున వారు ప్రార్ధనలు జరుపుతారు. ఉపవాసదీక్ష పూనుతారు.
గుడ్‌ఫ్రైడ్ అనే పదం గ్సాడ్ ప్రైడే అనే పదం నుంచి ఉద్భవించిందని చెబుతారు. ఈ పదం – పది లేదా 11వ శతాబ్దంలో సిరపడినట్లు తెలుస్తోంది.క్రైస్తవ గ్రంధాల ప్రకారం – ఏసుక్రీస్తు నజరత్ అనే పట్టణానికి చెందిన వ్యక్తి. ఈ పట్టణం ప్రస్తుతం ఇజ్రాయిల్‌లో ఉంది. చాలామంది ఏసును దేవుని బిడ్డగా భావించేవారు… పూజించేవారు, కొలిచేవారు. అయితే యూదు ప్రవక్తలకు, ఉన్నతాధికారులకు మాత్రం ఇది కడుపుమంటగా ఉండేది. ప్రజల్ని ఏసు తప్పుదోవ పట్టిస్తున్నాడని వారు భావించేవారు. దాంతో వారు ఎలాగైనా ఏసును హతమార్చాలని కుతంత్రం పన్నారు. జుడాలని పిలవబడే 12 మంది శిష్యులతో వారు ఈ పథకాన్ని అమలు పరిచేందుకు ప్రయత్నించాడు. వారు ఏసుక్రీస్తును నిర్భధించారు. ఆ మర్నాడు ప్రవక్తల సంఘం ముందు హాజరుపరిచారు.
ప్రజల్ని పక్కదోవ పట్టిస్తున్నాడని, చక్రవర్తికి పన్నులు కట్టక్కర్లేదని ప్రజలకు చెబుతున్నాడని, తాను దేవుని ప్రతినిధిగా చెప్పుకుంటున్నాడని… ఇలా వివిధ ఆరోపణల్ని ఏసుపై రుద్దారు. ఇవన్నీ నిజమని నిర్ధారించి రోమన్ చక్రవర్తి ముందు ఏసును హాజరు పరిచారు. అయితే చక్రవర్తి మాత్రం ఆ ఆరోపణల్ని నమ్మలేదు – అయినా మతప్రవక్తలు పట్టుబట్టి – నగరంలోని విధ్వంసకాండకు కూడా ఏసే కారణమని నమ్మబలికారు. చక్రవర్తిపై వారు మరింత ఒత్తిడి తీసుకురావడంతో ఇక చేసేది లేక చక్రవర్తి – ఏసును ఏం చేసుకుంటారో మీ ఇష్టం అని ఆ మతప్రవక్తలకు వదిలి వేశాడు. దీంతోవారు ఏసును శిలువ వేయాలని నిర్ధారించారు.
ఏసుక్రీస్తుకు తలపై ముళ్ళ కంప పెట్టారు. సైనికులు కొరడాలతో కొట్టారు. చెక్కతో చేసిన పెద్ద శిలువను ఆయన భుజాలపై మోపారు. కొంతదూరం నడిపించారు. చుట్టూ ప్రజలు… ఆయన వెనుక ఆయన అనుచరులు… ప్రజలు రాళ్ళతో కొట్టారు. చివరకు ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఏసుక్రీస్తుకు శిలువ వేశారు. చేతుల్ని శిలువకు మేకులతో బంధించారు. రక్తం ఓడుతున్న ఏసుక్రీస్తు మూడుగంటల తర్వాత ప్రాణం వదిలాడు. ఆ రోజు శుక్రవారం… మధ్యాహ్నం సరిగ్గా మూడు గంటలకు ఏసుక్రీస్తు శిలువపై తుది శ్వాస విడిచాడు. ఆ నాటి ఆ శిలువకు గుర్తుగా.. చర్చిల్లో శిలువను ఉంచే సంప్రదాయం నెలకొంది. మరణించే ముందు ఏసుక్రీస్తు దేవుణ్ణి ఇలా ప్రార్ధించాడు.
ప్రభూ నా మరణానికి కారణమైన వీళ్ళందరిని క్షమించు. వీరు పాపులే అయినా క్షమించి వదిలిపెట్టు ఎందుకంటే పాపం అని తెలీని అమాయకులు వారు. ఏసుక్రీస్తులోని దయాగుణం, క్షమం, ఔన్నత్యాలకు ఇది నిదర్శనం. అయితే ఇది జరిగిన రెండు రోజుల తర్వాత అంటే ఆదివారంనాడు ఏసుక్రీస్తు శిలువపై నుండి పునర్జన్మించాడు. అందుకే ఆ రోజు ఆనందసందోహాల ఈస్టర్ ఆదివారం జరుపుకుంటారు. గుడ్‌ఫ్రైడేనాడు జరుపుకునేవి అన్ని అంతకుముందు గురువారం రాత్రి ప్రారంభం అవుతాయి. చివరి సప్పర్ తీసుకున్న తరువాత – వారు ఈస్టర్ వరకు ఉపవాసం ఉంటారు. కైస్తవులకు ఆరాధనా స్థలం – ప్రశాంతతకు ప్రతిరూపంగా, అహ్లాదకర వాతావరణానికి ప్రతిబింబంగా నిలిచేది చర్చి.