గత ఏడాది బాలీవుడ్ నటి అనుష్క శర్మను ఇటలీలో వివాహం చేసుకున్న టీమిండియా సారథి విరాట్ కోహ్లీ దేశభక్తిని ప్రశ్నించి అప్పట్లో వార్తల్లోకెక్కారు. దేశంలోనే బీజేపీ ఎమ్మెల్యేలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుంటారు. తాజాగా మధ్యప్రదేశ్ గుణకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పన్నాలాల్ శాక్య అమ్మాయిలకు ఉచిత సలహా ఇచ్చి వివాదంలో చిక్కుకున్నారు. యువతులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.అబ్బాయిలతో అమ్మాయిలు స్నేహం చేయడం మానేస్తేనే మహిళలపై దాడులు జరగవన్నారు. అదే విధంగా అబ్బాయిలు కూడా అమ్మాయిలను ఆకర్షించే విధంగా దుస్తులు ధరించకూడదని తెలిపారు. యువతులను ఉద్దేశించి.. అసలు అమ్మాయిలకు బాయ్‌ఫ్రెండ్స్ అవసరమా అంటూ శాక్య ప్రశ్నించారు. అబ్బాయిలతో స్నేహం చేయడం ఆపేస్తే యువతులపై దాడులు కూడా ఆగిపోతాయన్నారు. ఇది యువతులకే మంచిదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వాఖ్యలపై మహిళ సంఘాలు మండిపడుతున్నాయి. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మరి కొంతమంది యువతులైయితే ఆయన చర్యలను తీసుకోవాలని కొరుతున్నారు.
Tags bjp mla dresing style madya pradesh womans
Related Articles
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
November 19, 2023