ఏపీలో గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ సర్కారు రెండున్నర లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని ఏకంగా ఒక పుస్తకాన్ని విడుదల చేసింది ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ.తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనకు బీనామీగా ఉన్న ఒక వ్యక్తీకి రెండు వందల నలబై కోట్ల విలువ చేసే భూమిని అప్పనంగా
కట్టబెట్టారు అని వైసీపీ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నారు.
ఈ సందర్భంగా వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రవీంద్రారెడ్డి ,రఘురామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ జీవో నెంబర్లు ఐదు వందల ఇరవై మూడు,ఐదు వందల నలబై ఏడు ద్వారా రెండు వందల నలబై కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని అప్పనంగా తన బినామీకి బాబు కట్టబెట్టారు అని వారు ఆరోపించారు.కావాలంటే దమ్ముంటే మా ఆరోపణలు నిజం కాదని ఆయన మీడియా సాక్షిగా చెప్పాలని సవాలు విసిరారు ..