‘మనకి సాయం చేసిన వారిని మరవకూడదు అంటారు..అందుకే చేసిన సాయం మరవకుండా చేసిన వారు అంత దూరంలో ఉన్న వెళ్లి మరి కలసి దాన్యవాదములు తెలిపారు. వారి మాటల్లోనే ఆయన గురించి తెలుసుకుందాం…. జగనన్నకు నా బాధ విన్నవించుకుంటే ఏ జన్మలో మరిచిపోలేని సాయం చేశారు. నాబిడ్డ త్వరలో మాట్లాడతాడని డాక్టర్లు చెబుతుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఏం చేసి జగనన్న రుణం తీర్చుకోవాలో మాకు అర్థం కావడం లేదు. తలుచుకుంటేనే ఏడుపొస్తోంది. జగన్ ముఖ్య మంత్రి అయితే తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డిలా ఆరోగ్యశ్రీతో ఇలాంటి ఎన్నో ఆపరేషన్‌లు ఉచితంగా చేయించి ఎందరో బిడ్డలకు మాటలు తెప్పించి నాలాంటి తల్లుల బాధ తీరుస్తారు’ అంటూ కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలం రేవనూరు గ్రామానికి చెందిన వెల్తుర్ల చినఓబులేసు, రాణమ్మ దంపతులు పొంగిపోయారు. వైఎస్ జగన్‌ను కలిసేందుకు ఆపరేషన్ చేయించుకున్న తమ బిడ్డతో శనివారం నరసరావుపేట వచ్చారు. వారి కథనం మేరకు.. కర్నూలు జిల్లా కోయలకుంట్ల మండలం రేవనూరు గ్రామానికి చెందిన వెల్తుర్ల చినఓబులేసు, రాణమ్మ దంపతులకు ఏడేళ్ల కుమారుడు సందీప్ ఉన్నాడు. అతను పుట్టుకతోనే మూగ, చెవుడుతో ఉన్నట్లు రెండున్నరేళ్ల తరువాత తల్లిదండ్రులు గుర్తించారు. గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చూపించగా ఆపరేషన్‌కు రూ.7 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు.
ఆరోగ్యశ్రీ వర్తించదన్నారు. రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబం కావడంతో ఆపరేషన్‌కు అయ్యే ఖర్చు భరించలేక, మాటలు రాని బిడ్డను చూస్తూ ఉండలేక మనోవేదనకు గురయ్యారు. గత ఏడాది నవంబర్ 14వ తేదీన వైఎస్ జగన్ పాదయాత్ర దొర్నిపాడు మండలం భాగ్యనగర్ వద్ద ఉన్నట్లు తెలుసుకుని ఓబులేసు, రాణమ్మ దంపతులు బిడ్డతో వెళ్లి ఆయన్ను కలిసి తమ బాధ చెప్పుకున్నారు. ‘ప్రభుత్వం సాయం చేయడం లేదు. మీరైనా మాట సాయం చేసి ఆదుకోండన్నా’ అంటూ ఆ దంపతులు కోరారు. వారి పరిస్థితికి చెలించిన వైఎస్ జగన్ తానున్నానంటూ భరోసా ఇచ్చారు. తన సోదరుడు వైఎస్ కొండారెడ్డిని పిలిచి ఆపరేషన్ ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు. జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో కొండారెడ్డి నాలుగు నెలల పాటు బాలుడితోపాటు తల్లిదండ్రులను హైదరాబాద్‌లో ఉంచి రూ.7 లక్షల ఖరీదైన కాక్లియర్ ఆపరేషన్‌ను ఉచితంగా చేయించారు. ఆపరేషన్ పూర్తయ్యి, బిడ్డ కోలుకున్నాక వైఎస్ జగన్ పాదయాత్ర గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఉందని తెలుసుకున్నారు. బిడ్డతో పట్టణానికి చేరుకున్న ఆ దంపతులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. దేవుడిలా ఆదుకున్నావన్నా అంటూ జననేతను పట్టుకుని విలపించారు.