ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన 121వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్ ఖరారు అయింది. మంగళవారం ఉదయం వైఎస్ జగన్ ఆశేశ ప్రభజనం మద్య సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల నైట్ క్యాంప్ నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు. అక్కడ నుంచి నార్నేపాడు క్రాస్, తంబళ్లపాడు క్రాస్, మాదాల, ఇరుకుపాలెం చేరుకుంటారు. అక్కడ భోజనం విరామం తీసుకుంటారు. విరామం అనంతరం వైఎస్ జగన్ పాదయాత్రగా సత్తెనపల్లి చేరుకుంటారు. ఈ మేరకు పాదయాత్ర షెడ్యూల్‌ను వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం సోమవారం విడుదల చేశారు.
