సెంట్రల్ యూనివర్శిటీలోని రాణి లక్ష్మిబాయి హాస్టల్లోని మహిళా విద్యార్థులు హాస్టల్ ప్రాంగణంలో ఉపయోగించిన సానిటరీ తువ్వాలను కనుగొన్న తర్వాత వారు శరీరం వెతికినట్లు వైస్ ఛాన్సలర్ కు ఫిర్యాదు చేశారు. అసలు ఏం జరిగిందంటే ..మధ్యప్రదేశ్‌లోని సాగర్ సెంట్రల్ యూనివర్శిటీలో లేడీస్ హాస్టల్ ఆవరణలో వాడి పారేసిన శానిటరీప్యాడ్‌ను చూసిన వార్డెన్ కోపంతో రగిలిపోయింది. గదుల్లో నుంచి అమ్మాయిలందరినీ పిలిపించి, వరుసగా నిలబెట్టి దుస్తులు విప్పించింది. ఆ శానిటరీ ప్యాడ్ వాడింది ఎవరో చెప్పాలంటూ లోదుస్తులను సైతం పరిశీలించేప్రయత్నం చేసింది. అవమానభారంతో వెక్కివెక్కి ఏడ్చిన విద్యార్థినులు చివరికి వీసికి ఫిర్యాదు చేశారు. చోటుచేసుకుంది.
మధ్యప్రదేశ్‌లోని సాగర్ పట్టణంలోగల హరిసింగ్ గౌర్ సెంట్రల్ యూనివర్సిటీ.. స్వాతంత్ర్యానికి పూర్వమే ఏర్పాటైన విద్యాసంస్థల్లో ఒకటి. దీనిని సాగర్ యూనివర్సిటీగా వ్యవహరిస్తారు. వర్సిటీ ఆవరణలోని రాణి లక్ష్మీబాయి హాస్టల్‌లో 40 మందికిపైగా విద్యార్థినులు ఉంటున్నారు. శనివారం హాస్టల్‌ను తనిఖీచేసిన వార్డెన్.. వాడిపారేసిన శానిటరీ ప్యాడ్ పడిఉండటాన్ని చూసి కోపంతో చిందులేసింది. తన సహాయకురాలితో కలిసి అమ్మాయిలందరినీ తనిఖీచేసింది. ఈక్రమంలోనే విద్యార్థినుల దుస్తులు విప్పించింది. ఆ మరుసటిరోజే విద్యార్థినులంతా కలిసి సదరు వార్డెన్ తీరుపై వీసీకి ఫిర్యాదుచేశారు. తక్షణమే వార్డెన్‌ను, సహాయకురాలిని తొలగించాలని డిమాండ్ చేశారు. దీనిపై “నేను వార్డెన్ తో మాట్లాడాను, కానీ ఆమె ఆరోపణలను ఖండించింది,” VC చెప్పారు. “మూడు రోజుల్లో, ఒక కమిటీ (విచారణ నిర్వహిస్తుంది) దాని నివేదికను సమర్పించబోతుంది, దీని తర్వాత చర్య తీసుకోబడుతుంది,” అన్నారాయన