వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారం హైదరాబాద్ మహానగరంలో నాంపల్లి లో ఉన్న ప్రత్యేక కోర్టుకు హాజరవుతారు.అయితే జగన్ మీద అప్పటి పాలక ప్రతిపక్షాలు కుట్రలు పన్ని అక్రమ కేసులు బనాయించారు.ఇదే విషయం గురించి ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన నలబై ఏళ్ళ రాజకీయ జీవితం పూర్తైన సందర్భంగా మీడియా సాక్షిగా చెప్పాడు .ఆయితే తాజాగా ఏబీఎన్ జగన్ అక్రమ కేసుల గురించి కొన్ని విషయాలను బయటపెట్టింది .ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
See Also:వైసీపీ అధినేత జగన్ సంచలనాత్మక నిర్ణయం ..!
ఉన్నది ఉన్నట్లు మీకోసం ..అదేమిటి అంటే ఆంధ్రజ్యోతికి ఉన్న ఇమేజ్ ఏమిటో వేరే చెప్పనక్కర్లేదు. ఇది తెలుగుదేశం పార్టీకి తోక పత్రిక అని అంటారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు. ఈ పత్రిక తీరుతెన్నులను గమనించే తటస్థ పాఠకుల్లోని అభిప్రాయం కూడా నిస్సందేహంగా ఇదే. ఎలాంటి పరిస్థితుల్లో అయినా చంద్రబాబును కాపాడుకోవడమే పరమావధిగా ఈ పత్రిక పనిచేస్తుంది అనే అభిప్రాయం జనాల నుంచినే వినిపిస్తూ ఉంటుంది. మరి ఇలాంటి ఇమేజ్ ఉన్న పత్రికకు యజమాని అయిన వేమూరి రాధాకృష్ణ తన వీకెండ్ కామెంట్లో ఆసక్తిదాయకమైన వ్యాఖ్యలు చేశాడు.
See Also:ఏపీలో వెయ్యి కోట్ల స్కాము ..ఆధారాలు “దరువు”చేతిలో ..!
అది కూడా ప్రస్తుత రాజకీయ పరిణామాలనూ.. గత రాజకీయ పరిణామాలనూ ప్రస్తావిస్తూ ఈయన తన కామెంట్ చేశాడు.అది జగన్ కేసుల గురించి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ రాజకీయ ఆరంగేట్రానికి సంబంధించి కావడం గమనార్హం. ఇంతకీ రాధాకృష్ణ ఏం చెప్పాడంటే..‘లక్ష్మినారాయణకు రాజకీయాల్లోకి రావాలని ఎప్పటినుంచో ఉన్నది… నిజానికి ఆయన 2014 లోనే తెలుగుదేశం పార్టీలో చేరి, ఎన్నికలలో పోటీ చేయాలనుకున్నారు. అయితే అప్పటివరకు జగన్ కేసుల మీద దర్యాప్తును చేసి, ఆ వెంటనే తెలుగుదేశం పార్టీలో చేరిపోతే, జగన్ మీద పెట్టిన కేసులు వీగిపోతాయని మిత్రులు సలహా ఇవ్వడంతో ఆయన తన ఆలోచనలను విరమించుకున్నారు.’
See Also:YSRCPలోకి కృష్ణా జిల్లాలో మొదలైన వలసలు -టీడీపీకి సీనియర్ నేత రాజీనామా ..!
అని రాధాకృష్ణ తన వీకెండ్ కామెంట్లో చెప్పుకొచ్చారు.అంతే దీన్ని బట్టి తేటతెల్లం అవుతోంది ఏమిటంటే.. లక్ష్మినారాయణ పక్కా తెలుగుదేశం పార్టీ మనిషి. చంద్రబాబుకు కావాల్సిన వ్యక్తి. అందుకే జగన్ కేసుల్లో అవసరంలేని దూకుడును కనబరిచాడు అని స్పష్టం అవుతోంది. వెనుకటికి చంద్రబాబుపై ఏదో కేసుల్లో ధర్యాప్తు అవసరం అయితే.. స్టాఫ్ లేదు.. అనే కారణం చెప్పి లక్ష్మినారాయణ విచారణను ఆపించాడు. కోర్టు ముఖంగానే అదంతా జరిగింది. అయితే జగన్ కేసుల సమయంలో మాత్రం ఈయన హీరోయిజానికి హద్దే లేకపోయింది.
జగన్ పై కేసులు కాంగ్రెస్ హై కమాండ్ ఆదేశానుసారం జరిగినవి అనేది బహిరంగ రహస్యం. తెలుగుదేశం, కాంగ్రెస్ లు ములాఖత్ అయ్యి.. జగన్ పై కేసులు వేయించాయి.. అనేది సత్యం. ఇలాంటి నేపథ్యంలో.. లక్ష్మినారాయణకు తెలుగుదేశంపై ఉన్న అభిమానంతో విచారణ మరింత దూకుడుగా జరిగింది. అయితే ఇంత చేసి జగన్ ను వీళ్లు ఏమీ చేయలేకపోయారు. కొన్ని నెలలు జైల్లో పెట్టారు.. అవినీతి పరుడు అని తెలుగుదేశం అభిమానుల్లో ముద్రవేయగలిగారు, అయితే.. ఇప్పుడు అందరి కథలూ బయటకు వస్తున్నాయి. అసలు కథలు వెలుగులోకి వస్తున్నాయి”అని ఉన్న కథనాన్ని జగన్ సైన్యం…గద్దె
రమేష్ నందిగామ అని యువకుడు పోస్టు పెట్టాడు .