వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై మేధావుల సంఘం అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం గుంటూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, నేడు శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని వైఎస్ జగన్ తన ప్రజా సంకల్ప యాత్రకు విరామం ప్రకటించారు. ఆదివారంతో 120 రోజులు పూర్తి చేసుకున్న వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర మంగళవారం 121 రోజు కొనసాగనుంది.
see also : కృష్ణా జిల్లాలో మొదలైన వలసలు -టీడీపీకి సీనియర్ నేత రాజీనామా ..!
ఇదిలా ఉండగా, చలసాని శ్రీనివాసరావు ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వైఎస్ జగన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. కేంద్ర ప్రభుత్వాలపై పోరాడిన ఘనత నాడు ఎన్టీఆర్, వైఎస్ఆర్‌ది అయితే, నేడు ఆ జాబితాలో వైఎస్ జగన్ చేరారన్నారు. వైఎస్ జగన్‌పై అక్రమ కేసులు బనాయించినా సరే.. కేంద్ర ప్రభుత్వాలకు లొంగక, బెదరక కేంద్ర ప్రభుత్వాన్ని ఢీకొట్టారని వైఎస్ జగన్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. అయితే, కాంగ్రెస్‌కు ఎదురు తిరగకుంటే వైఎస్ జగన్‌పై ఏ కేసు కూడా ఉండేది కాదు అంటూ గులాం నబీ ఆజాద్ అన్న మాటలను గుర్తు చేశారు చలసాని శ్రీనివాస్.
see also : ఛార్మిను ప్రేమలో దించింది ఇతనే ..!