హీరో రాజశేఖర్‌ను ఫుల్లుగా వాడేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్..!! గబ్బర్ సింగ్ చిత్రంలో హీరో రాజశేఖర్‌ను ఇమిటేట్ చేస్తూ.. రోజ్ రో జ్ రోజ్ రోజా పూవా..!! అంటూ సాగే పాటకి డ్యాన్స్ వేసిన కమెడియన్(పరోక్షంగా రాజశేఖర్) పై పవన్ కల్యాణ్ సెటైర్ వేసిన విషయం తెలిసిందే. అదే సీన్ ఇప్పుడు పవన్ కల్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న చల్ మోహన రంగ చిత్రంలోనూ రిపీటైంది. అయితే, ఈ చిత్రంలో ఆ పాటకు డ్యాన్స్ వేసింది మాత్రం పవన్ కల్యాణ్‌కు తమ్ముడిగా చెప్పుకునే హీరో నితిన్ కావడం గమనార్హం. కాగా, నిన్న విడుదలైన చల్ మోహన రంగ థియేట్రికల్ ట్రైలర్లో నితిన్ హీరో రాజశేఖర్‌ను ఇమిటేట్ చేస్తూ డ్యాన్స్ వేస్తున్న సన్నివేశం ఒకటి ఉంది.
see also : రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రూరల్ ఎమ్మెల్యే .. విలేకర్లకు ఏమాత్రం చిక్కకుండా రహస్యంగా
అయితే, గతంలో మెగా కుటుంబానికి, హీరో రాజశేఖర్ మధ్య వార్ నడిచిన విషయం తెలిసిందే. చిరంజీవి ఫ్యాన్స్ హీరో రాజశేఖర్‌పై దాడి చేయడం, అందుకు రాజశేఖర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం వంటివి చాలానే జరిగాయి. అయితే, చిరంజీవి కోరిక మేరకు కొన్ని నెలల తరువాత మెగా ఫ్యాన్స్‌పై పెట్టిన కేసులను రాజశేఖర్ ఉపసంహరించుకున్నారు. అలా ముగిసిన వీరి ఘర్షణలను పవన్ కల్యాణ్ మళ్లీ తెరమీదకు తీసుకొచ్చారని, ఆ నేపథ్యంలోనే హీరో రాజశేఖర్‌ను ఇమిటేట్ చేస్తూ గతంలో గబ్బర్ సింగ్ చిత్రంలో, ఇప్పుడు చల్ మోహన రంగ చిత్రంలోనూ సన్నివేశాలను పెట్టారన్నది సినీ జనాల మాట. ఏదేమైనా పవన్ కల్యాణ్ ఇలా హీరో రాజశేఖర్‌ను కించ పరుస్తూ సినిమాల్లో సన్నివేశాలను ఉంచడం ఏ మాత్రం సమంజసం కాదన్నది సినీ జనాల మాట.