జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అండ్ బ్యాచ్ మీద ఫైర్ అయ్యారు.ఈ రోజు సోమవారం వామపక్షాలతో సమావేశమయ్యారు.ఈ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ విభజన వలన నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ విభజన చట్టంలోని హామీలను నేరవేరుస్తారని
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు మీద ..
అవి నెరవేరేదాకా పోరాడతారని రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ సర్కారు మీద కానీ నమ్మకం లేదని ఆయన అన్నారు.రాష్ట్రంలో అన్ని పక్షాలు ,ప్రజలు ,ప్రజాసంఘాలు రోడ్లపైకి వచ్చి పోరాడుతుంటే టీడీపీ మాత్రం అవినీతి అక్రమాలకు పాల్పడుతూ అందినకాడికి దోచుకుంటున్నారని.
.అమరావతి ఏపీకి రాజధాని లా కాకుండా టీడీపీ నేతలు దోచుకోవడానికి అడ్డగా మారిందని ఆయన ఆరోపించారు.అయితే ప్రస్తుతం ప్రత్యేక హోదా కోసం అహర్నిశలు కష్టపడుతున్న వైసీపీ శ్రేణుల మీద ..అధినాయకత్వం మీద నమ్మకం ఉందని ఆయన వ్యాఖ్యానించారు ..