ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లపై విజయవాడ వెస్ట్ నియోజకవర్గం వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇవాళ విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జలీల్ ఖాన్ మాట్లాడుతూ.. ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఒక జఫ్పా అని అందరికి తెలుసు, మరో పక్క చిత్రసీమలో నాటకాలు వేసుకుంటూ అక్కడ సంపాదించింది సరిపోక, మరింత డబ్బు సంపాదన కోసం ఇటీవల కాలంలో రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్ గురించి మాట్లాడటం టైం వేస్ట్ అంటూ జగన్, పవన్‌లను జలీల్ ఖాన్ తన వాక్చాతుర్యంతో ఏకిపారేశారు.
see also: యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్న ఆంధ్ర పొలిటికల్ సరికొత్త సర్వే ..!!
అయితే, చంద్రబాబు గురించి జలీల్ ఖాన్ మాట్లాడుతూ.. ప్రశంల వర్షం కురిపించారు. టీడీపీ ఎంపీలు అవిశ్వాస తీర్మానం పెట్టగానే పార్లమెంట్‌లోని ఇతర పార్టీలకు చెందిన 200 మంది ఎంపీలు మద్దతు ఇచ్చారని, కానీ వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు పెట్టిన అవిశ్వాస తీర్మానానికి ఏ ఒక్క ఎంపీ కూడా మద్దతు పలకకపోవడం బాధాకరమంటూ ఎద్దేవ చేశారు. అందుకు కారణం వైఎస్ జగన్‌పై ఉన్న అవినీతి కేసుల గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటుండటమే కారణమని చెప్పారు జలీల్ ఖాన్. చంద్రబాబు నీతి, నిజాయితీ, నిబద్ధత గల వ్యక్తి కాబట్టే 200 మంది ఎంపీలు మద్దతు ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు.
see also :
లోటస్ పాండ్ లో డెబ్బై పడకగదులు ఉన్నాయా..?
ఇదిలా ఉండగా, ఈ వార్త చదివిన వైఎస్ జగన్ అభిమానులు జలీల్ ఖాన్‌పై పెదవి విరుస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై గెలిచిన నీవు, ఇప్పుడు అదే పార్టీకి చెందిన అధినేతపై విమర్శలు చేయడానికి కాస్తైనా ****** ఉండాలంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతుండగా, మరోపక్క పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కూడా *******అదే స్థాయిలో జలీల్ ఖాన్‌పై రెచ్చిపోతున్నారు.