వచ్చ నెలలో జరిగే ఐపీయల్ మ్యాచ్ లకు హైదరాబాద్ సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఆడేది కాస్తా డౌట్‌గానే ఉంది. సౌతాఫ్రికాతో జరిగిన టెస్టులో బాల్‌ట్యాంపరింగ్‌కు పాల్పడిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా వేటు వేసింది. అయితే ఆ టెస్టులో ఆసీస్ టీమ్ వైస్‌కెప్టెన్‌గా ఉన్న డేవిడ్ వార్నర్‌పై మాత్రం ఇంకా క్రికెట్ ఆస్ట్రేలియా ఎటువంటి చర్యను ప్రకటించలేదు. టీమ్ అంతా కలిసి బాల్ ట్యాంపరింగ్ చేశామని స్మిత్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్ టీమ్ సన్‌రైజర్స్ ఇప్పుడు వార్నర్‌పై ఎటువంటి నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉన్నది. క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకునే నిర్ణయాన్ని బట్టే, సన్‌రైజర్స్‌కు వార్నర్ ఆడేది లేనిది స్పష్టమవుతుందని ఆ టీమ్ మెంటర్ వీవీఎస్ లక్ష్మణ్ తెలిపారు. కేప్‌టౌన్ టెస్టులో జరిగిన ఉదంతం నిజంగా దురదృష్టకరం, కానీ వార్నర్‌పై తాము ఇప్పుడే ఏమీ చెప్పలేమని, క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం వెలుబడ్డాకే తాము ఓ నిర్ణయం తీసుకుంటామని లక్ష్మణ్ చెప్పారు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా, టీమ్ నుంచి ఆసీస్ ప్లేయర్ స్మిత్ తప్పుకున్నాడు. ఆస్థానంలో టీమిండియా క్రికెటర్ అజింక రహనేను కెప్టెన్ గా ప్రకటించారు
