ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సీ-ఫోర్స్ అనే సంస్థ ఎన్నికలు వస్తే ఎవరికెన్ని సీట్లు వస్తాయి అనే అంశం మీద లేటెస్ట్ సర్వే నిర్వహించింది.ఈ సర్వేలో కర్ణాటక రాష్ట్రంలో అధికారంలోకి రావాలని తెగ కలలు కంటున్నా బీజేపీ పార్టీకి దిమ్మతిరిగి బొమ్మ కనపడే విధంగా షాకిచ్చారు ప్రజలు .
సీ-ఫోర్స్ సంస్థ రాష్ట్రంలో ఉన్న మొత్తం రెండు వందల ఇరవై నాలుగు నియోజకవర్గాలలో నూట యాబై నాలుగు నియోజకవర్గాల్లో ఇరవై రెండు వేల మూడు వందల యాబై ఏడుమంది ఓటర్ల అభిప్రాయాలను సేకరించింది.అదే క్రమంలో రెండు వేల మూడు వందల అరవై ఎనిమిది పోలింగ్ బూత్ పరిధి ప్రాంతాలను కవర్ చేస్తూ మొత్తం మూడు వందల ఇరవై ఆరు పట్టణాల్లో..తొమ్మిది వందల డెబ్బై ఏడు గ్రామీణ ప్రాంతాల్లో అభిప్రాయాలను సేకరించింది.
ఈ సేకరణలో కాంగ్రెస్ పార్టీకి నూట ఇరవై ఏడు స్థానాలు ..బీజేపీ పార్టీకి మాత్రం అరవై స్థానాలు మాత్రమే వస్తాయి అని తేలింది.అయితే ఈ సర్వే ఈ నెల ఒకటో తారిఖు నుండి నిన్న ఆదివారం వరకు స్థానిక ఓటర్ల అభిప్రాయాలను తెలుసుకుంది.గత సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా సీ-ఫోర్స్ సంస్థ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీకి నూట పంతొమ్మిది స్థానాలు వస్తాయి అని చెప్పగా కాంగ్రెస్ పార్టీ నూట ఇరవై రెండు స్థానాలతో అధికారాన్ని చేపట్టింది.