ఏపీ ముఖ్యమంత్రి అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు గత నాలుగు ఏళ్ళ చరిత్రలోనే అత్యంత కీలక ..ప్రపంచంలోనే ఎనిమిదో వింతగా చెప్పుకునే నిర్ణయాన్ని తీసుకున్నారు.ఈ రోజు ముఖ్యమంత్రి నారా రాష్ట్ర సచివాలయం ఉన్న వెలగపూడిలో అఖిల పక్ష సమావేశం నిర్వహించాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు .
అందులో భాగంగా రాష్ట్రంలో చిన్న చితక పార్టీల దగ్గర నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ వరకు అందర్నీ పిలిపించి మరి రాష్ట్ర ప్రయోజనాల కోసం సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు.ఈ క్రమంలో ప్రతి పార్టీకి ఇద్దరు చొప్పున ఆహ్వానించి కేంద్రం అమలు చేయాల్సిన హామీలపై ..
ఇవ్వాల్సిన నిధుల గురించి ఎలా పోరాటాలు చేయాలి అనే దాని గురించి చర్చించనున్నట్లు బాబు తన పార్టీ శ్రేణులతో వ్యాఖ్యానించారు.అయితే గత నాలుగు ఏళ్ళల్లో లేని విధంగా బాబు ఇలా మొదటి సారిగా అఖిలపక్షాన్ని పిలిపించి అది రాష్ట్ర ప్రయోజనాల కోసం సమావేశం నిర్వహించడం అత్యంత కీలక నిర్ణయం కదా ..