పెద్ద ఎన్టీఆర్‌నే అవమానిస్తావా..? నువ్వెంత.. నీ బతుకెంత..!!, అవును, తెలుగు సినీ నటి మాధవీ లత టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే, ఇటీవల కాలంలో ఏపీ ప్రభుత్వానికి, తెలుగు వెండితెర నటీనటులకు మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. కాగా, మొన్నటికి మొన్న టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ మీడియా ముఖంగా మాట్లాడుతూ.. టాలీవుడ్ నటులు రాసలీలలకు ఇచ్చే ప్రాధాన్యత ఏపీ రాష్ట్ర ప్రయోజనాలకు ఇవ్వడంద లేదంటూ బాహాటంగా విమర్శించారు. అంతటితో ఆగక ఏసీ రూముల్లో హీరోయిన్లతో కులకడమే హీరోల పని అయింది, వారికి టిక్కెట్ల రూపంలో ధనాన్ని సమకూర్చిన ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే పట్టించుకోరా అంటూ ప్రశ్నించారు.
see also : యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్న ఆంధ్ర పొలిటికల్ సరికొత్త సర్వే ..!!
ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలపై టాలీవుడ్‌కు చెందిన పలువురు ఘాటుగానే స్పందించారు. పోసాని కృష్ణ మురళీ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు అనుభవం కలవాడని, మమ్మల్ని ఉద్దరిస్తారని ముఖ్యమంత్రిగా అధికారం కట్టబెడితే.. చంద్రబాబును ప్రశ్నించకుండా.. మమ్మల్ని ప్రశ్నిస్తావా..? దొడ్డిదారిని కుమారుడ్ని మంత్రిని చేసిన మీ ముఖ్యమంత్రిని ప్రశ్నించు ధైర్యముంటే అంటూ ధీటుగానే సమాధానం చెప్పారు పోసాని కృష్ణ మురళీ. అలాగే, తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. నాడు ప్రత్యేక హోదా కోసం పోరాడేందుకు వచ్చిన మా టాలీవుడ్ నటులను జైల్లో పెట్టించిన టీడీపీ ప్రభుత్వం.. మళ్లీ ప్రత్యేక హోదా కోసం పోరాడాలని ఎలా పిలుస్తున్నారంటూ ఘాటుగానే స్పందించారు.
see also : వైఎస్ జగన్ ..మీరు చేసిన సాయం జన్మలో మరువలేము..దేవుడిలా నీవు..!
ఈ నేపథ్యంలో సినీ నటి మాధవీలత స్పందిస్తూ.. తెలుగుదేశం పార్టీని స్థాపించిన పెద్ద ఎన్టీఆర్ ఎక్కడ్నుంచి వచ్చారు..? ఆయన కూడా సినీ ఇండస్ర్టీ నుంచే కదా రాజకీయాల్లోకి వచ్చారు. సినీ ఇండస్ర్టీ, ఏపీ రాజకీయాలు అంతమయ్యే వరకు ఆయన పేరు చిరస్థాయిలో ఉంటుందన్నారు మాధవీలత. అటువంటి వ్యక్తి వచ్చిన సినీ ఇండస్ర్టీని అవమానిస్తూ రాజేంద్ర ప్రసాద్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు.