ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ దగ్గర నుండి అధికార టీడీపీ వరకు ,ప్రజాసంఘాల దగ్గర నుండి ప్రజల వరకు అందరూ రోడ్లపైకి వచ్చి గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు అయిన బీజేపీ ,టీడీపీ ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలని చేయని పోరాటాలు లేవు .ఏకంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అయితే ఏకంగా కేంద్రం మీద గత ఆరురోజులుగా అవిశ్వస తీర్మానాన్ని ఇస్తూ వస్తుంది.
ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ విభజన చట్టంలో ఉన్న ..గత సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ ఇచ్చిన ప్రత్యేక హోదా ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నాము .కానీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ..టీడీపీ అధికారంలో ఉన్నంతవరకు అది సాధ్యం కాదని తేల్చి చెప్పారు .గత నాలుగు ఏండ్లుగా మట్టి దగ్గర నుండి గాలి వరకు అన్నిటిలో అవినీతి చేస్తూ ప్రజల సొమ్మును దోచుకుంటున్నారు .ఆఖరికి స్కూల్ పిల్లలకు టాయిలెట్స్ నిర్మాణంలో ఆరు వందల కోట్ల రూపాయలను కూడా వదలని ఘనులు అని టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు ..