గత కొద్దీ రోజులుగా ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అటు సోషల్ మీడియా లో తెగ వినపడుతున్న పేరు టీం ఇండియా ఆటగాడు మహమ్మద్ షమీ .గత పక్షం రోజులుగా తన భార్య హసిన్ జహాన్ తో వివాదాలతో ఆయన వార్తల్లో నిలుస్తున్నారు .తాజాగా క్రికెటర్ షమీ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు . డెహ్రాడూన్ నుండి దేశ రాజధాని మహానగరం ఢిల్లీ వెళ్ళుతుండగా ఈ ప్రమాదం జరిగింది .అయితే స్వల్ప గాయాలతో షమీ బయటపడ్డాడు .డెహ్రాడున్ లో ఒక ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు డాక్టర్లు తెలిపారు ..