ప్రముఖ తెలుగు న్యూస్ మీడియా ఛానల్స్ కు చెందిన టీవీ5 వైస్ ప్రెసిడెంట్ ,ఎడిటర్ ఇ సాంబశివరావు ఏపీకి ప్రత్యేక హోదా అనే చర్చను ప్రముఖ దర్శకనిర్మాత రచయిత అయిన పోసాని కృష్ణమురళితో నిర్వహించిన సంగతి విదితమే.ఈ చర్చ కార్యక్రమంలో భాగంగా సాంబశివరావు మాట్లాడుతూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో బ్రోకర్లు లేరా ..?
లం.ముం.లు లేరా ..రియల్ ఎస్టేట్ పేరిట దోచుకునే దళారులు లేరా అని ఇండస్ట్రీలోని మహిళా క్యారెక్టర్ ఆర్టిస్టు దగ్గర నుండి స్టార్ హీరోయిన్ వరకు అందర్నీ టార్గెట్ చేస్తూ అసభ్యకరమైన కామెంట్స్ చేశారు.దీనిపై ఇండస్ట్రీకి చెందిన నటి నటులు స్పందించారు.
అందులో భాగంగా టాలీవుడ్ నటీనటులు ఝాన్సీ,హేమ,శివాజీ రాజా ,బెనర్జీ ,ఉత్తేజ్ తదితరులు కల్సి హైదరాబాద్ మహానగరంలో జూబ్లిహిల్స్ పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేశారు. సాంబశివరావు మీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ త్వరగా చేస్తామని వారికి హామీ ఇచ్చారు..