ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి అధికార టీడీపీ పార్టీ నుండి వలసల జోరు మొదలైంది .అందులో భాగంగా ఇటీవల జగ్గంపేట కు చెందిన టీడీపీ సీనియర్ నేత జ్యోతుల చంటిబాబు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు .తాజాగా ఆ పార్టీకి చెందిన సత్తెనపల్లి నియోజక వర్గ టీడీపీ పార్టీ సీనియర్ నేత నిమ్మకాయల రాజనారాయణ వైసీపీ అధినేత సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు.నిమ్మకాయల రాజనారాయణ 2009సార్వత్రిక ఎన్నికల్లో సత్తెనపల్లి నుండి పోటీ చేశారు
ఈ క్రమంలో నిమ్మకాయల తో పాటుగా ఆతుకూరి నాగేశ్వరరావు అనే సీనియర్ నేత కూడా వైసీపీ గూటికి చేరనున్నారు .అయితే ఈ నెల 27న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో భారీ అనుచరవర్గంతో వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు అని వారు తెలిపారు .అందులో భాగంగా మున్సిపల్ వైస్ చైర్మన్ ,ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు ఆతుకూరి నాగేశ్వరావు ఇంట్లో సమావేశమై ఈ విషయం తెలిపారు..