వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట పంతొమ్మిది రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .జగన్ పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది . పాదయాత్రలో భాగంగా జగన్ నరసారావు పేట లో పాదయాత్ర చేశారు. ఈ సందర్బంగా నరసారావు పేటలో భారీ బహిరంగ సభను నిర్వహించారు .ఈ సభలో అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మనవడు కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బలమైన నాయకత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యం .
ప్రజలకు సంక్షేమం అందుతుంది .పల్నాడు ఇలా ఉందంటే కారణం దివంగత మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ,దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ వలనే. మరల రాజన్న పాలన రావాలంటే జగనన్న సీ ఎం కావాలి .పల్నాడు లో ఎక్కడైనా సరే ఎవరికీ ఏ కష్టం వచ్చిన కానీ కాకితో కబురు పంపండి ఈ కాసు మహేష్ రెడ్డి వస్తాడు .మీ కష్టాల్లో తోడుంటాడు .. మీకు కల్గిన కష్టాన్ని తీరుస్తాడు .నరసారావు పేటలో టీడీపీ నేతలకు భయపడద్దు.. వాళ్ళ అరాచక పాలన మరి ఇంకొన్ని నెలలే ఆ తర్వాత జగనన్న నాయకత్వంలో రాజన్న పాలనా వస్తుందని ఆయన భరోసా ఇచ్చారు ..