మీరు ఎయిర్టెల్ నంబర్ ను వాడుతున్నారా ..మీకు స్మార్ట్ ఫోన్ ఉందా ..అయితే ఎయిర్టెల్ శుభవార్తను ప్రకటించింది.ప్రముఖ టెలికాం సంస్థ అయిన ఎయిర్టెల్ సంస్థ 4జీ వోల్టే సర్వీసులను అధికారకంగా ప్రారంభించే పనిలో ఉంది.అంతకంటే ముందు సాంకేతక సన్నద్ధత,లోపాల గుర్తించడానికి ఫోర్ జీ వోల్టే బీటా సేవలను దేశ వ్యాప్తంగా కొన్ని సర్కిళ్ళను ఆరంభించింది.
అందులో భాగంగా ఉచితంగా మేమందించే డేటాను వాడుకోండి.మా సేవలు ఎలా ఉన్నాయో పరిశీలించి అభిప్రాయాలను చెప్పాలని ఈ సంస్థ ఆహ్వానం పలికింది.ఈ క్రమంలో ఏపీ ,కేరళ ,ఒడిశా ,పశ్చిమ బెంగాల్ ,పంజాబ్ సర్కిళ్ళలో ఈ అవకాశం అందుబాటులో ఉంటుంది.
దీంతో యూజర్లు నాలుగు వారాల పాటు ముప్పై జీబీ డేటాను వాడుకోవచ్చు.ఇందులో పది జీబీ వరకు డౌన్ లోడ్ పెట్టుకోవచ్చు.అనంతరం ఫీడ్ బ్యాక్ తీసుకుంటారు.అంతే కాకుండా ఆ తర్వాత పది జీబీ వరకు డేటాను ఇస్తారని సంస్థ తెలిపింది .