శ్రీమంతుడు చిత్రం తర్వాత ప్రిన్స్ మహేశ్‌బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన ‘భరత్ అనే నేను’ చిత్రంపై భారీ అంచనాల నెలకొన్నాయి. ముఖ్యమంత్రి పాత్రలో మహేశ్‌బాబు నటిస్తున్న సంగతి తెలిసిందే .తాజాగా ‘విరచిస్తా నేడే నవశకం..నినదిస్తా నిత్యం జన హితం..’ అంటున్నారు సూపర్‌స్టార్ మహేశ్‌బాబు. తాజాగా ఈ సినిమాలోని తొలి లిరికల్ పాటను చిత్రబృందం ఈరోజు విడుదల చేసింది. ‘విరచిస్తా నేడే నవశకం..నినదిస్తా నిత్యం జన హితం..భరత్ అనే నేను హామీ ఇస్తున్నాను’ అంటూ నెమ్మదిగా సాగుతున్న ఈ పాట వినసొంపుగా ఉంది. ఈ చిత్రంలో మహేశ్‌కి జోడీగా కైరా అడ్వాణీ నటిస్తున్నారు.డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 20న ‘ భరత్ అనే నేను ’ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
