జేసీ ముఖర్జీ ట్రోఫీలో ఆడుతోన్న వృద్ధిమాన్ సాహా చెలరేగిపోయి స్కోరు బోర్డుని పరుగులు పెట్టించాడు. 20 బంతుల్లో శతకం సాధించడం అంటే ఎంత కష్టమో అందరికీ తెలుసు. ఎదుర్కొన్న ప్రతి బంతిని బౌండరీకి తరలించాలి. అప్పుడైతేనే శతకం సాధించగలం. తాజాగా భారత ఆటగాడు వృద్ధిమాన్ సాహా 20 బంతుల్లో 102 పరుగులు చేసి ఆశ్చర్యపరిచాడు. ఇందులో 14 సిక్స్‌లు ఉండగా.. నాలుగు పోర్లు ఉన్నాయి 20 బంతుల్లో ఏకంగా 14 సిక్స్‌లు, నాలుగు పోర్ల సాయంతో 102 పరుగులు చేశాడు. ఈ రోజు ఆ ట్రోఫీలో భాగంగా మోహున్ బగన్-బెంగాల్ నాగ్‌పూర్ రైల్వేస్ జట్ల మధ్య మ్యాచ్ జరగగా.. మోహున్ బగన్ జట్టుకు సాహా ప్రాతినిథ్యం వహిస్తోన్న సాహా ఇలా అదరగొట్టేసి అందరి దృష్టినీ తన వైపునకు తిప్పుకున్నాడు.
బెంగాల్ నాగ్‌పూర్ రైల్వేస్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 151 పరుగులు చేయగా, ఛేజింగ్‌లో ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చిన సాహా ఇలా బ్యాటు ఝుళిపించడంతో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా ఏడు ఓవర్లలోనే మోహున్ బగన్ జట్టు గెలుపొందింది. ప్రత్యర్థి జట్టు బౌలర్ అమన్ ప్రొసాద్ వేసిన ఏడవ ఓవర్‌లో సాహా 37 పరుగులు చేయడం మరో విశేషం. సాహా చెలరేగడానికి తోడు అదే జట్టులో ఓపెనర్‌గా వచ్చిన బ్యాట్స్‌మెన్ అమన్ కూడా 22 బంతుల్లో 43 పరుగులు చేయడంతో సాహా టీమ్ ఘన విజయం సాధించింది