రాత్రిపూట సరిగ్గా తిన్న కానీ ఎంత గింజుకుంటున్న కానీ నిద్ర పట్టదు.దీంతో రాత్రి అంతా జాగారమే.మొబైల్ ఉంటె దాంట్లో నెట్ ఆన్ చేసి ఒకటే చాటింగ్ ..సేర్పింగ్ ..ఇలా ఆ రాత్రిని గడిపేస్తాం.అయితే మనకు సరిగ్గా నిద్రపట్టకుండా ఉండటానికి కూడా మనం తీసుకునే ఆహారం కూడా ఒక కారణమవుతుందని అంటున్నారు నిపుణులు.అదేమిటి అన్నం తింటే నిద్రపట్టాలి
కదా ..నిద్ర పట్టకపోవడం ఏమిటి అని ఆలోచిస్తున్నారా ..అన్నం తీసుకున్న కానీ నిద్ర ఎందుకు పట్టదంటే జీర్ణక్రియ సక్రమంగా జరగకపోతే నిద్ర పట్టదు.సాధారణంగా జీర్ణక్రియ జరుగుతున్నప్పుడు మాత్రమే మనకు నిద్రపడుతుంది.అందుకే నిద్ర పోయే ముందు కింద తెలిపిన తినకూడదు అంటున్నారు.
అవేమిటో తెలుసుకోండి మరి ఆలస్యం ఎందుకు ..!.ప్రస్తుత రోజుల్లో పిజ్జా అంటే ఇష్టపడని వారుండరు అంటే అతిశయోక్తి కాదేమో.అంతగా పిజ్జాను ఇష్టపడుతుంటారు.అయితే పిజ్జా అనేది పగటిపూట జీర్ణమై ఆహారం కాబట్టి రాత్రి పూట అసలు తీసుకోకూడదు అంటారు.ఒకవేళ రాత్రి పూట తీస్కుంటే నిద్రించే సమయంలో శరీరంలోని భాగాలన్నీ నిదానంగా పనిచేయడంతో జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది.చక్కర ఎక్కువగా ఉండే క్యాండీస్ లో షుగర్ ఎక్కువగా ఉంటుంది.ఇది బరువును పెంచడంలో దోహదపడుతుంది.దీన్ని తినడం వలన రాత్రిపూట అలసట వస్తుంది.త్వరగా జీర్ణమవ్వదు.దీంతో నిద్రకు భంగం కలుగుతుంది.ఇక చాక్లెట్స్ అబ్బో వీటిని ఇరవై నాలుగు గంటలు తినమన్న కానీ విసుక్కోకుండా తింటారు.వీటిని నైట్ పూట తినడం వలన జీర్ణం కావు.
దీంతో అసిడిటీ సమస్య వచ్చి నిద్ర పట్టదు.పీచు పదార్ధం ఉండే ఆహారాలను ఉదయం ,మధ్యాహ్నం మాత్రమే తినాలి కానీ రాత్రి పూట తింటే అవి జీర్ణమవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది.నిద్ర పట్టదు.ఇక మద్యం ,టీ ,కూల్ డ్రింక్స్ తీసుకోకపోవడమే మంచిది కాదు.ఇవి అనారోగ్యానికి గురిచేస్తాయి.నిద్రకు ఆటంకం కల్గిస్తాయి.ఎందుకంటే అసిడిటిను కల్గిస్తుంది.మసాలా ఫుడ్స్ ,బర్గర్లు రాత్రిపూట తినకూడదు .రాత్రిపూట కొవ్వును ఎక్కువగా చేసి గుండె జబ్బులు రావడానికి కారణమవుతాయి కాబట్టి ఇవి కూడా రాత్రి పూట తినకూడదు ..