ఏపీలో ఒకపక్క అధికార టీడీపీ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తున్నా నేపథ్యంలో మరోవైపు పార్టీలోనే నేతల మధ్య అంతకంటే ముందు ఎమ్మెల్యేలలో పార్టీ అధిష్టానం ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది.అందులో భాగంగా రాయలసీమ ప్రాంతానికి చెందిన అనంతపురం జిల్లా టీడీపీలో అప్పుడే వర్గ పోరు మొదలైంది.అందులో భాగంగా స్థానిక టీడీపీ పార్టీ క్యాడర్ అంతా స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కూటమి కడుతున్నారు అని జిల్లా రాజకీయాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.జిల్లాలో తాడిపత్రి అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గత సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నుండి వలస వచ్చిన సంగతి విదితమే.అయితే నియోజకవర్గంలో ఎప్పటి నుండో టీడీపీలో ఉంటున్న నేతలందరూ కల్సి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా కూటమిగా ఏర్పడుతున్నారు.
ఈ కూటమికి 1995నుండి టీడీపీలో ఉంటున్న ఫయాజ్ బాషాను కాదని కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన ప్రభాకర్ రెడ్డికి సీటును ఇచ్చాడు బాబు.ఆ నేపథ్యంలో జేసీ బ్రదర్ అయిన దివాకర్ రెడ్డి ఫయాజ్ కు నామినేటెడ్ పదవి ఇప్పిస్తాను అప్పట్లో నచ్చచెప్పాడు.అధికారంలోకి వచ్చి నాలుగు ఏండ్లు అయిన కానీ ఎటువంటి పదవివ్వకుండా ఫయాజ్ కు అనుచరుడిగా ఉన్న జిలాన్ బాషాకు మున్సిపల్ వైస్ చైర్మన్ పదవినిప్పించాడు జేసీ .అక్కడితో ఆగకుండా మరోవైపు తన అల్లుడు దీపక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇప్పించేశాడు.దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఫయాజ్ గత కొంతకాలంగా ఎమ్మెల్యేకు దూరంగా ఉంటూ కింది స్థాయిలో తన మద్దతుదారులతో కల్సి ప్రజల్లో ఉంటూ బలమైన నేతగా ఎదుగుతున్నారు.
రానున్న ఎన్నికల్లో తాడిపత్రి నుండి టీడీపీ నుండి టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా అయిన సరే నిలబడి అయిన గెలవాలని ..గెలిచి జేసీ బ్రదర్స్ కు ,చంద్రబాబుకు బుద్ధి చెప్పాలనే కృత నిశ్చయంతో ఉన్నట్లు జిల్లాలో వార్తలు వినిపిస్తున్నాయి.ఈ క్రమంలో నియోజకవర్గంలో తనకు చాప కింద నీరులా ఫయాజ్ రావడంతో ఏమి చేయాలో అర్ధం కాక పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు అంట ప్రభాకర్ రెడ్డి.ఏది ఏమైనా సరే కానీ రానున్న ఎన్నికల్లో టీడీపీలో ఉంటె ఫయాజ్ వర్గం తనను ఓడించడం ఖాయం కాబట్టి పార్టీ మారడమే ఉత్తమని అభిప్రాయంలో ఉన్నారు ప్రభాకర్ .అయితే రానున్న ఎన్నికల్లోపు బాబుకు మరో రాయాసీమ ఎమ్మెల్యే షాక్ ఇవ్వనున్నారు అన్నమాట ..