ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ,అతని ఆస్థాన మీడియాగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు విమర్శిస్తున్న కొన్ని తెలుగు ప్రముఖ న్యూస్ ఛానల్స్ లో పనిచేసేవారికి ఆడవారంటే ఎంత మర్యాదనో..గౌరవమో గత కొంతకాలంగా మహిళలను ఉద్దేశించి వారు చేస్తున్న వ్యాఖ్యలను బట్టి అర్ధమవుతుంది.గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కోడలు మగబిడ్డను కంటానంటే అత్తా వద్దంటదా అని యావత్తు మహిళా లోకాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడాడు.
అప్పట్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన మహిళలు మినహా ఎవరు స్పందించలేదు.తాజాగా ఆయన ఆస్థాన మీడియాగా ముద్రపడిన ..ప్రతిపక్షాలు విమర్శిస్తున్న ప్రముఖ తెలుగు న్యూస్ మీడియా ఛానల్ టీవీ5 కి చెందిన సీనియర్ న్యూస్ రీడర్ సాంబశివరావు మహిళలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
నిన్న శుక్రవారం సాయంత్రం ప్రముఖ దర్శక నిర్మాత రచయిత పోసాని కృష్ణమురళితో లైవ్ లో మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో బ్రోకర్లు లేరా …లంజముండలు లేరా అని ఇండస్ట్రీలో ఉన్న చిన్న క్యారెక్టర్ మహిళా ఆర్టిస్ట్ దగ్గర నుండి స్టార్ హీరోయిన్ వరకు అందర్నీ కల్పి ఇలా మాట్లాడి మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.అయితే గతంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై విరుచుకుపడిన మహిళా సంఘాలు ప్రస్తుతం చంద్రబాబు ,సాంబశివరావు వ్యాఖ్యలపై స్పందించకపోవడం విడ్డూరం ..!