తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ లోకి టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ హీరో ,ఒకప్పుడు హీరోగా ఇండస్ట్రీను వరస సినిమాలతో ఒక ఊపు ఊపి నేడు సపోర్టింగ్ క్యారెక్టర్ చేస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటున్న సీనియర్ నటుడు సుమన్ తానూ వస్తాను అనే సంకేతాలు ఇచ్చారు.
నిన్న శుక్రవారం యదాద్రిలో లక్ష్మీ నరసింహ స్వామీను దర్శించుకున్న సుమన్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానిస్తే టీఆర్ఎస్ లో చేరతాను.గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజల మదిని దోచుకున్నారు.
ముఖ్యంగా గౌడ సామాజిక వర్గానికి ఎవరు ఎప్పుడు చేయని విధంగా పలు పథకాలను అమలు చేస్తూ అందరికి అన్ని చేస్తున్నారు.గౌడ జాతికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషికి నా పాదాభివందనం అని ..ఒకవేళ నా అవసరం ఉంటె ఖచ్చితంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అండగా ఉంటాను అని ఆయన ప్రకటించేశారు.