ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అతని ఆస్తాన మీడియాను ఒక ఆట ఆడుకున్నాడు ప్రముఖ దర్శక నిర్మాత రచయిత పోసాని కృష్ణమురళి.నిన్న శుక్రవారం పోసాని ప్రముఖ తెలుగు మీడియా న్యూస్ ఛానల్ టీవీ5కి ఇంటర్వ్యూ ఇచ్చారు.ఆ ఇంటర్వ్యూ లో ఇ సాంబశివరావు మాట్లాడుతూ మీ సినిమావాళ్ళు ఏపీ
ప్రజల కోసం పోరాటాలు చేయలేరా..ప్రజల్లో కష్టాల్లో ఉంటె ముందుకురారా ..
ప్రత్యేక హోదా గురించి మాట్లాడారా అని అడిగారు.దీనికి సమాధానంగా పోసాని మాట్లాడుతూ “మేము ఎందుకు వస్తాము.మేము మిమ్మల్ని గెలిపించి అధికారంలో కూర్చోబెట్టాం.మీరు మాకోసం పోరాడుతూ మా సమస్యలను పరిష్కరిస్తారు అని కదా..మీకు మేము జీతాలు ఇవ్వడంలేదా ..ఉండటానికి ఇల్లు ఇవ్వడంలేదా ..మీకు రక్షణగా ఉండే గన్ మెన్స్ కు కూడా ప్రతిదీ మేమే ఇస్తున్నాం ..మీరు ఎమ్మెల్యేలుగా రిటైర్మెంట్ అయినాక సకల సౌకర్యలిస్తున్నం.
మీకు నెలకు లక్షల లక్షల జీతమిస్తున్నాం.మీరంతా పదవులకు రాజీనామా చేసి బయటకు రండి.మేము ముఖ్యంగా నేను రాజకీయాల్లోకి వస్తా ..ఢిల్లీ వెళ్లి కొట్లాడి మనకు రావాల్సిన నిధులు ,నెరవేర్చాల్సిన హామీలను నెరవేరేలా పోరాడుతా ..దమ్ముందా ..కులం ..మతం అని చూడకుండా మీ మీడియా మద్దతు ఇస్తారా అని ఒక ఆట ఆడుకున్నాడు.అయితే పోసాని అడిగే ప్రశ్నలకు సమాధానం లేక ప్రకటనలు ఇచ్చారు ఇ సాంబశివరావు..