ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసిన అధికారంలో టీడీపై ప్రజలు, ప్రతి పక్షలు , కేంద్రంలో అధికారంలో ఉన్న భారత జనతా పార్టీ నేతలందరు కలసి చెప్పే మాట అవీనితి. ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ నేతలు అత్యతం దారుణంగా రాష్ట్రాన్ని దొచుకుంటున్నారని విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంపై బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం అవినీతి మయం అయిపోయిందని, దానిని అంతమొందించవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు.పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు, అక్రమాలు,నిధుల దుర్వినియోగంపై మసూద్ కమిటీకి పిర్యాదు చేస్తామని ఆయన అన్నారు. అంతేకాదు టీడీపీ ప్రభుత్వ అవినీతిపై కేంద్రం వద్ద అన్ని ఆదారాలు ఉన్నాయని ఆయన అన్నారు.మట్టి పేరుతో కోట్లు నొక్కేశారని ఆయన అన్నారు. పోలవరం కాల్వకు గండి పడితే పదకుండు కోట్లు అవినీతికి పాల్పడ్డారని ఆయన అన్నారు. ఎత్తిపోత పదకం అంటే అవినీతిని ఎతిపోయడమేనని ఆయన అన్నారు. 1200 కోట్ల ప్రాజెక్టు 1600 కోట్లకు ఎలా పెరిగిందని ఆయన ప్రశ్నించారు. జన్మభూమి కమిటీలు అవినీతి కమిటీలుగా మారాయని అన్నారు. టీడీపీ అంటే తెలుగు డ్రామాల పార్టీగా మారిందని ఆయన అన్నారు.నీరు -చెట్టు స్కీమ్ కింద తెలుగు తమ్ముళ్లు పదివేల కోట్ల రూపాయలు కాజేశారని ఆయన అన్నారు.చంద్రబాబు ప్రతి అవినీతికి సంబందించి కేంద్రం వద్ద ఆధారాలు ఉన్నాయని సోము వీర్రాజు చెప్పడం ప్రస్తుతం హట్ టాపిక్ గా మారింది.
