టాలీవుడ్, కోలీవుడ్‌లలో అగ్రతారగా వెలుగుతూ వరుస సినిమాలతో ముందుకు దూసుకుపోతున్న హీరోయిన్ నయనతార. నయనతారకు తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో కిక్కెంచే హీరోయిన్‌గా పేరుంది . మొదట్లో శింభు, తర్వాత ప్రభుదేవా యనతార ప్రేమయణం నడిపారు. తరువాత విఘ్నేశ్ శివన్ – నయనతారలు ప్రేమలో మునిగి తేలుతున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇద్దరికి వీలు కుదిరినప్పుడల్లా ప్రేమ యాత్రలకు విదేశాలు వెళ్తూ ఉంటారు. వీరి ప్రేమకు పునాది.. నాన్‌మ్ రౌడీ ధాన్(తెలుగులో నేనూ రౌడీనే)చిత్ర షూటింగ్ సందర్భంగా ఏర్పడింది.
ఆ తర్వాత వీరిద్దరూ పలు ఈవెంట్లలో జంటగా కనిపిస్తూ హాట్ టాపిక్‌గా మిగిలారు. ఒకానోక దశలో వీరిద్దరూ కేరళలో రహస్యంగా వివాహం చేసుకున్నట్లు వార్తలు రావటం.. వాటిని నయనతార ఖండించటం చూశాం. ఆ సమయంలో విఘ్నేశ్‌తో ఉంది కేవలం స్నేహం మాత్రమే అంటూ ఆమె ప్రకటించారు. అయినప్పటికీ వారి మధ్య రిలేషన్‌షిప్ గురించి తర్వాత చాలా కథనాలు వచ్చాయి. ఈ క్రమంలో శుక్రవారం ది హిందూ పత్రిక నిర్వహించిన మహిళా అవార్డుల వేడుకలో నయనతార పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటనా రంగంలో ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న నయన్.. తల్లిదండ్రులకు, సోదరుడికి, కాబోయే భర్త(విఘ్నేశ్‌ను ప్రస్తావిస్తూ)కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు వేదిక మీద ప్రకటించింది. దీంతో వీరిద్దరూ త్వరలో వివాహం చేసుకోబోతున్నారన్నవిషయం నిజం అయ్యింది.