నందమూరి యంగ్ హీరో కళ్యాణ్ రామ్ హీరోగా కొత్త దర్శకుడు ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో ప్రముఖ స్టార్ హీరోయిన్ అందాల రాక్షసి కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నిన్న శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన మూవీ ఎం.ఎల్.ఎ .విడుదలైన దగ్గర నుండి హిట్ టాక్ తో ప్రేక్షకుల మదిని దోచుకోవడమే కాకుండా మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది.
ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు ఎమ్మెల్యే మూవీ తొలిరోజే ప్రపంచ వ్యాప్తంగా ఐదు కోట్ల ఇరవై లక్షల గ్రాస్ ను వసూలు చేసింది అని సమాచారం.మొదటి రోజు నైజాంలో ఎనబై ఆరు లక్షలకు పైగా ..సీడెడ్ లో యాబై ఒక్క లక్షలకు పైగా వసూలు సాధించడం విశేషం.అయితే కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే ఇవే అత్యధిక వసూలు అని సినీ వర్గాలు అంటున్నాయి.