ఆంధ్రప్రదేశ్ రైతుల సంక్షేమం కోసం పట్టిసీమ ప్రాజెక్టు నిర్మించి, పంట పొలాలను పచ్చగా మారుస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం వేలకోట్లకు అవినీతికి పాల్పడింది. రూ.1,125 కోట్ల వ్యయ ప్రతిపాదనలతో మొదలైన పట్టిసీమ ప్రాజెక్టు చివరకు 1,667 కోట్లకు చేరింది. ఇలా చంద్రబాబు హయాంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవినీతిలో నెంబర్ వన్ స్థానం పొందిందని చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత సోము వీర్రాజు. కాగా, ఇవాళ సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. పట్టిసీమలో చంద్రబాబు ప్రభుత్వం పాల్పడిన అవినీతిని ఏకిపారేశారు.
see also : పోసానిలా ప్రతి తెలుగోడు ఆలోచిస్తే కేంద్రం దిగొచ్చి ప్రత్యేక హోదా ఇస్తుంది..!
పట్టిసీమ ప్రాజెక్టుకు వేసింది 24 పైప్‌లు అయితే, వాటిని 30 పైపులుగా చూపి రూ.342 కోట్లును చంద్రబాబు ప్రభుత్వం స్వాహా చేసిందన్నారు. అలాగే, పట్టిసీమ ప్రాజెక్టులో నిర్మించిన డయాఫ్రమ్ వాల్ పేరుతో టెండర్లు పిలవకుండానే రూ.90 కోట్లు సీఎం చంద్రబాబు కాజేశారని చెప్తూ కాగ్ నివేదికను మీడియా ముందు ఉంచారు సోము వీర్రాజు. అంతేకాకుండా, మట్టిని తీయడానికి రూ.67 కోట్లు ఖర్చు చేసినట్లు పట్టిసీమ ప్రాజెక్టు లెక్కల్లో చేర్చారని, అదంతా చంద్రబాబు అవినీతి భాగోతమని చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్టులో తవ్విన మట్టిని.. ఒక లారీ మట్టి రూ.4 లక్షలు వంతున కాజేశారన్నారని పేర్కొన్నారు సోము వీర్రాజు.
see also : .రండి నేను ప్రాణాలర్పిస్తా ..చంద్రబాబు & బ్యాచ్ కు పోసాని సవాలు ..!
ప్రభుత్వం ఉచితంగా ఇళ్లు కట్టిస్తుందని ప్రజలను నమ్మించి.. ఆ తరువాత సీఎం చంద్రబాబు ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలతో ఒక్కో ఇంటికి, ఒక్కో లబ్ధిదారుడి వద్ద నుంచి రూ.20 వేలు చొప్పన వసూలు చేయించారని, ఆఖరికి చంద్రబాబు వృద్ధులను సైతం వదలకుండా కొత్త పింఛన్ల కోసం వచ్చిన వారి నుంచి మూడు నెలల నగదును ముందుగానే లబ్ధిదారుల నుంచి వసూలు చేశారని మీడియా ముఖంగా చెప్పారు బీజేపీ నేత సోము వీర్రాజు.