ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇవాళ మీడియాతో మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పైకి సాఫ్ట్‌గా కనపడినా.. లోపల మాత్రం ఫ్యాక్షనిజం, ఉగ్రవాదుల ఆలోచనలే ఉంటాయన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉగ్రవాదులకంటే ప్రమాదమని పేర్కొన్నారు.
see also : బూమ్రాతో లవ్ .. షాకిచ్చే క్లారిటీచ్చిన రాశీఖన్నా ..!
తన స్వార్ధం కోసం ఒక స్పష్టత లేని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ప్రజలను మోసం చేసేందుకు, అదే విధంగా ప్రత్యేక హోదా పేరిట తన హోదాను నిబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న వైఎస్ జగన్‌కు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అర్హతే లేదని ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. మాట తప్పను.. మడమ తిప్పను అన్న జగన్ మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలు రాజీనామాలు చేసి ఉంటే ప్రజలు నమ్మేవారన్నారు. ప్రజలను ఇంకా మోసం చేయాలన్నటువంటి ఆలోచనలను మానేసి, కేసుల నుంచి విముక్తి చెందేందుకే ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నారని విమర్శించారు.
see also :
అతన్నే పెళ్లి చేసుకుంటా.రకుల్ ప్రీత్ సింగ్ క్లారిటీ ..!