ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం మరికొన్ని రోజుల్లో రణరంగంగా మారనుంది. చూసుకుందాము నువ్వా..నేనా అనే విదంగా వచ్చే ఎన్నికలపై విసురుతున్నసవాళ్లు అన్ని పార్టీల నాయకులు. మన రాజకీయ సమీకరణాలు రోజురోజుకి మారుతున్నాయి. ఎందుకంటే 2014 ఎన్నికల్లో టీడీపీని నమ్మి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి అన్యాయం చేసింది. టీడీపీ అదికారంలో ఉండి కూడ , ఎన్నికలకు ముందు ఇచ్చిన 600 హమీల్లో 6 అంటే 6 కూడ నేరవేర్చలేదు. రైతులు. మహిళలు, నిరుద్యోగులు, చదువుకునే పిల్లలు ఇలా ఏ ఒక్కరికి ఒక్క న్యాయం చెయని ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ఎలా ఓటు వేస్తారు. మరి ముఖ్యంగా ఏపీ అంతట మహిళలపై అత్యంత దారుణంగా టీడీపీ నేతలు దాడి చేస్తుంటే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోక పోవడం ప్రజల్లో టీడీపీ పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అది యావత్తు తెలుగు ప్రజల గుండెల్లో నాటుకుపోయింది. మరోపక్క టీడీపీ చేసే ప్రతి అన్యాయన్ని ఎండగడుతూ.. ప్రజలకు భరోసానిస్తూ..గత 118 రోజులుగా దుమ్ము,ధూళి,గాలి ,ఎండ అనుకోకుండా ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర చేస్తున్నాడు. ఈ పాదయాత్ర బాగా హిట్ అయ్యింది. ఎంత హిట్ అంటే ఇక ఏపీ అంతట ఒక్కటే మాట వచ్చే ఎన్నికలో ఖచ్చితంగా వైఎస్ జగన్ సీఎం కావడం ఖాయం అని.
See also..
జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా వెనక అసలు కథ ఇదే ..!
ఇక అసలు విషయానికి వస్తే 2019లో వైఎస్ జగన్ సీఎం అయితే మాత్రం చంద్రబాబు, లోకేష్ లు జైలుపాలవడం ఖాయమని తెలుస్తుంది. అదెలాగంటే నిన్నటి వరకు మిత్రుడిగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొన్న జరిగిన సభలో లోకేష్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. లోకేష్ అవినీతికి పాల్పడుతున్నారని, ఐటీ దాడుల్లో దొరికిపోయిన శేఖర్‌రెడ్డితో ఆయనకు సంబంధాలు ఉన్నాయని బాంబు పేల్చాడు. లోకేశ్‌పై తాను చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు ఉన్నాయని, అవసరమైన సమయంలో బయటపెడతానని తెలిపాడు. ఇదే నిజమయితే వైఎస్ జగన్ సీఎం అయితే లోకేష్ అవినీతి ఆధారాలు సేకరించి జైలుకు పంపిస్తాడని సమచారం. అంతేగాక ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుని కూడా జగన్ జైలుకు పంపేస్తాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. తెలంగాణాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ఏసిబికి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. దీంతో ఈ వ్యవహారం నడిపింది చంద్రబాబేనని ఆడియో టేపులను కూడా బయటపెట్టారు. కనుక వైఎస్ జగన్ 2019 లో ముఖ్యమంత్రి అయిన తరువాత ఓటుకు నోటు కేసుని కూడా బయటకు తీసి చంద్రబాబు భరతం పడతాడని రాజకీయవాదులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
see also..