ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిని నిర్మించే క్రమంలో.. అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన లక్షల కోట్ల నిధులను పక్కదారి పట్టించారా..? అంతటితో ఆగక ఆ నిధులన్నింటిని హవాలా రూపంలో విదేశాలకు తరలించారా.? అందులో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోపాటు, మంత్రుల వాటా ఎంత..? ఈ భారీ కుంభకోణంలో 2014 ఎన్నికల్లో టీడీపీతో జతకట్టిన బీజేపీ, జనసేన నేతల వాటా ఎంత..? అన్న ప్రశ్నలతో కూడిన కథనం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
see also : ”పవన్ కల్యాణ్‌తో పెళ్లి”పై క్లారిటీ ఇచ్చిన శ్రీరెడ్డి..!!
అయితే, పై ప్రశ్నలకన్నింటికీ అవుననే సమాధానం చెప్తూ, పలు ఆధారాలను కూడా జత చేస్తున్నారు నెటిజన్లు. అందులో ఒకటి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందు ఆంధ్రప్రదేశ్ అప్పు రూ.96వేల కోట్లు ఉంటే.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఏపీ అప్పులు ఒక్కసారిగా 2 లక్షలా 20 వేల 434 కోట్లకు పెరిగిన విషయం తెలిసిందే. ఈ అంశం పై ప్రశ్నలన్నింటికి అవుననే సమాధానం చెప్పేలా ఉందనేది నెటిజన్ల అభిప్రాయం.
see also : చంద్రబాబు వెంట ఉండేవారంతా నేరస్తులా ..!
అంతే కాకుండా, ఏపీ అభివృద్ధి కోసమంటూ పలు బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పును సీఎం చంద్రబాబు నాయుడు తన అనుచవర్గంతో కలిసి విదేశాలకు తరలించారని, అంతేకాకుండా, విలువ మొత్తం రూ.1,25,0000 కోట్లు అంటూ సోషల్ మీడియా బల్లగుద్దిమరీ చెబుతోంది. అయితే, ఈ విషయాన్ని కేవలం సోషల్ మీడియానే కాకుండా, గురువారం వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పార్లమెంట్ వేదికగా మీడియా సాక్షిగా వెల్లడించారు. చంద్రబాబు అండ్ కో ఏపీ అభివృద్ధి కోసం తీసుకున్న నగదులో కొంత రూ.1,25,0000 కోట్లును విదేశాలకు హవాలా చేశారని చెప్పారు విజయసాయిరెడ్డి. ఏదేమైనా ఇటీవల కాలంలో సీఎం చంద్రబాబు ఏపీ అభివృద్ధిపేరిట భారీ అవినీతికి పాల్పడ్డారని ఇటు సోషల్ మీడియాతోపాటు, అటు రాజకీయ నాయకులు చెబుతుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో బీజేపీతో రాజీ చేసుకునేందుకు చంద్రబాబు తన పార్టీ నేతలను మోడీ వద్దకు పంపించారని సమాచారం.
see also :
చంద్రబాబు..నారా లోకేష్ పై సంచలన వాఖ్యలు చేసిన పోసాని కృష్ణమురళి