ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్ఎం వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా, రైతుల సంక్షేమం కోసం పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టినప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడి స్థానంలో ఉన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హేళన చేశారని, కానీ, అదే పట్టిసీమతో సీఎం చంద్రబాబు లక్షల ఎకరాల్లో పంటలకు సాగునీరు అందిస్తూ రైతుల కళ్లలో ఆనందం నింపారన్నారు. అంతేగాక, సీఎం చంద్రబాబు చేపట్టిన ఆ బృహత్తర కార్యక్రమానికి ప్రతిపక్షం అడ్డుపడటం తప్ప సమకరించింది లేదన్నారు. చంద్రబాబు పట్టిసీమ ప్రాజెక్టు నిర్మించిన చోటే.. నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రైతుల నుంచి 10వేల ఎకరాల భూములను లాక్కున్నారన్నారని ఆరోపించారు.
see also : చంద్రబాబు వెంట ఉండేవారంతా నేరస్తులా ..!
see also : వెలుగులోకి టీడీపీ హత్యలు..!!
సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం కేంద్రంలోని ప్రతిపక్ష పార్టీలతో పాటు, పలు రాష్ట్రాల అధికార పార్టీలను సంప్రదించి ఎంపీల మద్దతు కూడగడుతుంటే.. అవేవీ పట్టిన వైఎస్ జగన్ పాదయాత్రంటూ ఏపీలో విహార యాత్ర చేస్తున్నారని ఎద్దేవ చేశారు. జగన్ చేపడుతున్న ప్రజా సంకల్ప యాత్రకు జనాన్ని తరలించేందుకే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కావడం లేదన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలకు జీతాలను కూడా రద్దు చేయాలని ఎమ్మెల్యే ఎస్‌వీఎస్ఎం అసెంబ్లీ స్పీకర్‌ను కోరారు.