ఏపీ అధికార టీడీపీ పార్టీ ఎంపీ ,ముఖ్యమంత్రి ,ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు ఇటివల కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన సుజన చౌదరి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో రహస్యంగా భేటీ అయ్యారు అని వార్తలు దేశ రాజధాని ఢిల్లీలో ..జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఇటివల ప్రత్యేక హోదాపై కేంద్రం వెనక్కి
పోవడంతో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో మిత్రపక్షాలుగా ఉన్న టీడీపీ ,బీజేపీ పార్టీలు తెగ దెంపులు చేసుకున్న సంగతి విదితమే.
అయితే గత కొంతకాలంగా ఇరుపార్టీలకు చెందన నేతలు ఒకరిపై ఒకరు పలు అవినీతి ఆరోపణలు చేయడమే కాకుండా బీజేపీ పార్టీకి చెందిన రాష్ట్ర నేతలు ఒక అడుగు ముందుకేసి రాష్ట్ర ప్రభుత్వం మీద ,టీడీపీ నేతలపై సీబీఐ విచారణ కోరతామని ప్రకటనల మీద ప్రకటనలు చేస్తున్న సంగతి తెల్సిందే.అయితే సీబీఐ విచారణ నుండి తప్పించుకోవడానికే చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు అయిన సుజన ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వద్దకు రాయభారం పంపించాడు.
పైకి బీజేపీ నేతలపై విమర్శలు చేస్తున్నకానీ అంతరంగంగా కల్సి ఉందామనే సంకేతాలు పంపించినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.ఒకవైపు రాష్ట్ర ప్రజలు రోడ్లపైకి వస్తుంటే మరోవైపు సుజన చౌదరి కేంద్ర మంత్రిని కలవడం వెనక పలు కారణాలు అనుమానాలు ఉన్నాయని జాతీయ మీడియా కథనాలను ప్రసారం చేస్తున్నాయి ..