పోసాని కృష్ణమురళి ప్రస్తుతం ఇటు టాలీవుడ్ అటు ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్న పేరు.ఉన్నది ఉన్నట్లు మాట్లాడే స్వభావం స్వభావం ఉన్న ప్రముఖ దర్శక నిర్మాత ..వందకు పైగా సినిమాలకు కథ మాటలు రాసిన రచయిత.ఆయన ప్రస్తుతం తెలుగు మీడియా ఛానల్స్ లో ఒకటైన టీవీ9 కి ఇటివల ఇంటర్వ్యూ ఇచ్చారు.ఈ సందర్భంగా ఇంటర్వ్యూ లో పోసాని మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా పోరాటానికి తెలుగు సినీ పరిశ్రమ మద్దతు తెలపడంలేదని, బస్సుల్లో పడుకుని మరీ సీఎం చంద్రబాబు ఏపీని అభివృద్ధి చేస్తుంటే.. టాలీవుడ్ వాళ్లు మాత్రం డబ్బు మత్తులో జోగుతున్నారన్న టీడీపీ ఎమ్మెల్సీ బాబూరాజేంద్రప్రసాద్‌కు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చారు.మత్తులో జోగుతున్నది సినిమావాళ్లన్న అంటున్నారని.. అసలు మత్తులో జోగుతోంది ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అని అన్నారు. లోకేష్‌కు సంబంధించిన పలు చిత్రాలను చూపుతూ.. ఆయన కేవలం అమ్మాయిలతోనే మందు తాగుతారని, విదేశాల్లో టేపుతో అమ్మాయిల నడుమును కొలుస్తారని అన్నారు. స్విమ్మింగ్ పూల్‌లో అమ్మాయిలతో గడుపుతూ మందు తాగి, సినిమా వాళ్ల కన్నా నీచంగా ప్రవర్తించింది మీ నేతే అనే విషయాన్ని రాజేంద్రప్రసాద్ తెలుసుకోవాలని అన్నారు.
