మూవీ పేరు –ఎం.ఎల్.ఎ
తారాగణం –నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ,కాజల్ ,పోసాని కృష్ణ మురళి,జయప్రకాశ్ రెడ్డి తదితరులు..
సంగీత దర్శకుడు-మెలోడీ బ్రహ్మ మణిశర్మ..
కూర్పు-బి.తమ్మిరాజు..
నిర్మాణ సంస్థ-బ్లూ ప్లానెట్ ఎంటర్ టైన్ మెంట్స్..
నిర్మాతలు-కిరణ్ రెడ్డి,భరత్ చౌదరి,విశ్వప్రసాద్..
ఛాయాగ్రహణం-ప్రసాద్ మూరెళ్ళ
కథ,కథనం,దర్శకత్వం-ఉపేంద్ర మాధవ్
రీలీజ్ డేట్-మార్చి 23,2018
కళ్యాణ్ రామ్ నందమూరి హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత తన సొంత టాలెంట్ తో టాప్ పొజిషన్ కు చేరుకున్న యంగ్ అండ్ డైనమిక్ హీరో.ఒకవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు సొంత బ్యానర్లో వేరే సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ ఆ పాత్రలో కూడా చక్కని పేరు తెచ్చుకున్నాడు.ఇటివల విడుదలైన ఇజం అనుకుంత రేంజ్ లో హిట్ కాకపోయిన కానీ
ఏ మాత్రం చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ఎమ్మెల్యే (ఎం.ఎల్.ఎ)అంటూ తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చారు.మంచి లక్షణాలున్న అబ్బాయిగా ప్రేక్షుకుల ముందుకొచ్చిన కళ్యాణ్
రామ్ అందర్నీ మెప్పించాడా ..ఒక లుక్ వేద్దాం .
అసలు ఎం.ఎల్.ఎ కథ ఏమిటంటే –
అన్ని సినిమాల మాదిరిగా కళ్యాణ్ రామ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ను చూస్తాడు.ఫస్ట్ లుక్ లోనే హీరో అమ్మడుతో ప్రేమలో పడతాడు.అయితే హీరోయిన్ మాత్రం హీరో నుండి తప్పించుకొని తిరుగుతుంది.ఆ క్రమంలో హీరోయిన్ ఒక సమస్యలో చిక్కుకుంటుంది.అయితే అన్ని సినిమాల మాదిరిగా హీరోయిన్ ను హీరో సేవ్ చేసినట్లు
ఇక్కడ హీరో కూడా కాపాడతాడు.అయితే హీరోయిన్ వాళ్ళ డాడి తన కూతుర్ని ఎమ్మెల్యేకిచ్చి పెళ్లి చేయాలనీ కలలు కంటుంటాడు.అయితే హీరోయిన్ వాళ్ళ కుటుంబం ఉంటున్న నియోజక వర్గ ఎమ్మెల్యే రవికిషన్ కిచ్చి తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు జయప్రకాశ్ రెడ్డి.ఇలాంటి తరుణంలోనే హీరో వచ్చి నేను తనను పెళ్లి చేసుకుంటా అని చెప్తాడు.అయితే జయప్రకాశ్ రెడ్డి వీరిద్దరి పెళ్ళికి ఒప్పుకున్నాడా ..ఎలా ఒప్పుకున్నాడు ..హీరో హీరోయిన్ ను పెళ్లి చేసుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఏమిటి ..ఎమ్మెల్యేను అల్లుడిగా చేసుకోవాలని ఆశపడిన జయప్రకాశ్ రెడ్డి తన ఆశను ఏ విధంగా నెరవేర్చుకున్నాడు.స్థానిక ఎమ్మెల్యేకి హీరోకి మధ్య వార్ ఎందుకొచ్చింది ఇలా కథలోని మిగతా భాగాన్ని తెరపై
చూడాల్సిందే .
సినిమా ఎలా ఉంది అంటే-
రొటీన్ లాగే కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన గత చిత్రాల మాదిరిగా ఇది కూడా పక్కా కమర్షియల్ మూవీ.మూవీ ప్రారంభమైన మొదటి భాగంలో కథ మాములుగానే ఉన్నాకాని సెకండాఫ్ లో మాత్రం పీక్ తీసుకెళ్ళుతుంది.ఈ మూవీలో ఇందు ఎదుర్కున్న సమస్య ఏమిటి ..ఎమ్మెల్యే అల్లుడిగా రావాలని ఆశపడిన జయప్రకాశ్ రెడ్డిని ఎలా
మెప్పించాడు.హీరోయిన్ ను పెళ్లి చేస్కోవడానికి హీరో ఎమ్మెల్యే అయ్యాడా ..ఎమ్మెల్యే అయ్యే విధానాన్ని దర్శకుడు తీసిన విధానం నాభూతో న భవిష్యత్తు అన్నట్లు ఉంది.అంతే కాకుండా చదువుకునే వయస్సులో చిన్నపిల్లలను పనికి పంపొద్దని మంచి సందేశాన్నివ్వడమే కాకుండా పాటలు ,సంగీతం ,నేపథ్య సంగీతం ,పంచ్ డైలాగ్స్ మొత్తం సినిమాను ఒక రేంజ్ లో
నిలబెట్టాయి.ఇది అందరికి తెల్సిన కథే అయినప్పటికీ తీసిన విధానం ,స్క్రీన్ ప్లే ,దర్శకత్వం ఇంతకూ ముందేక్కడ చూడని విధంగా తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
ఎవరి నటన ఎలా ఉందంటే-
పటాస్ మూవీతో మంచి ఊపులో ఉన్న కళ్యాణ్ రామ్ ఈ మూవీ లో మరింత ఎనర్జిటిక్ గా ..పంచ్ డైలాగ్స్ ,యాక్షన్ ,లవ్ అండ్ రొమాంటిక్ ఇలా పలు సీన్లలో తనకంటే ఎవరు బాగా నటించరని మరోసారి నిరూపించాడు.ఇక కాజల్ అగర్వాల్ గురించి కొత్తగా ఏమి చెప్పనకర్లేదు.ఇటు అందాలను ఆరబోయడంలో అటు నటించడంలో గత సినిమాల కంటే ఎక్కువ మోతాదులో నటించి అందర్నీ ఆకట్టుకుంది.అమ్మడు సినిమా సినిమాకు అందాన్ని ,అభినయాన్ని పెంచుకుంటూ వచ్చింది.ఎమ్మెల్యే రవికిషన్ గురించి గతంలో వచ్చిన రేసు గుర్రం లోని పాత్రకి మించి ఎక్కువగా నటన ఆస్కారమున్న పాత్ర ఈ మూవీలో దక్కింది.రవికిషన్ మరో పది ఇరవై సినిమాలకు వెనక్కి తిరిగి చూసుకోకుండా అవకాశాల మీద అవకాశాలు రావడం ఖాయం.ఇక పోసాని గురించి చెప్పుకోవాలంటే ఎవర్ గ్రీన్ అని చెప్పాలి నటన ..మిగతా వెన్నెల కిషోర్ ,తర్టి ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి వారి వారి పాత్ర పరిధిలో నటించి మెప్పించారు.చిత్రం నిర్మాణ విలువలు టేకింగ్ సూపరబ్.మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం మూవీకి మెయిన్ హైలెట్ అని చెప్పాలి .దర్శకుడిగా తోలి మూవీ అయిన కానీ సీనియర్ దర్శకుడు తీస్తే ఎలా ఉంటుందో అంతకు మించి ఈ మూవీను చక్కగా తెరకెక్కించి మంచి మార్కులే కొట్టేశాడు.
మూవీ బలం ..
కథ, కథనం
వినోదం
కమర్షియల్ ఎలిమెంట్స్
నిర్మాణ విలువలు
సంగీతం ,నేపథ్య సంగీతం
మూవీ బలహీనతలు..
తెల్సిన కథ కావడం
దరువు ట్యాగ్ లైన్-ఈ ఎమ్మెల్యే దాటికి మిగతావారికి డిపాజిట్లు కూడా దక్కవు ..
రేటింగ్ –3.2/5