Home / ANDHRAPRADESH / ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలోస్తే ఎవరికెన్ని..!

ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలోస్తే ఎవరికెన్ని..!

ఏపీ రాష్ట్ర రాజకీయాలను గత కొద్ది రోజులుగా స్పెషల్ స్టేటస్ అనే అంశం ఒక ఊపు ఊపుతున్న సంగతి తెల్సిందే.కేవలం ఈ ఒకే ఒక్క కారణంతో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో గత నాలుగు ఏళ్ళుగా మిత్రపక్షంగా రాసుకొని పూసుకొని తిరిగిన టీడీపీ ,బీజేపీ పార్టీలు తమ నాలుగేళ్ళ అనుబంధాన్ని తెంచుకున్నాయి.ఇలాంటి తరుణంలో ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ..ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరికీ ఎన్ని సీట్లు వస్తాయి అని ప్రముఖ నేషనల్ మీడియా ఛానల్ ఒకసర్వే చేపట్టిందని..ఆ సర్వేలో ప్రస్తుత అధికార టీడీపీ పార్టీకి గతంలో వచ్చిన సీట్ల కంటే చాలా తక్కువ సీట్లు వస్తాయి అని ..అదే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి మాత్రం ఎవరు ఊహించని విధంగా గతంలో కంటే ఎక్కువగా స్థానాలను గెలుచుకొని అధికారాన్ని చేపడతుందని ఆ సర్వేలో తేలిందని ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ,సోషల్ మీడియాలో నేషనల్ సర్వే పేరిట ఒక వార్త తెగ చక్కర్లు కొడుతుంది.

 

 

ఈ సర్వేలో వచ్చిన ఫలితాల ఆధారంగా ప్రస్తుత అధికార పార్టీ గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ఆరు వందల ఎన్నికల హామీలలో ఒక్కటి నేరవేర్చకపోగా ..విభజన చట్టంలో ఉన్న ప్రత్యేక హోదా ,రైల్వే జోన్ ,కడపకు ఉక్కు పరిశ్రమ లాంటి హామీలను తుంగలో తోక్కడమే కాకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకొని గత నాలుగు ఏళ్ళుగా చేస్తున్న దాదాపు రెండున్నర లక్షల కోట్ల అవినీతి అక్రమాల పట్ల ప్రజల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకత వలన గతంలో వచ్చిన స్థానాల్లో నలబైకి పైగా కోల్పోయి కేవలం అరవై స్థానాలను మాత్రమే గెలుచుకుంటుందని ఈ సర్వేలో తేలింది.ఇక గత సార్వత్రిక ఎన్నికల్లో కేవలం ఐదు లక్షల (రెండు శాతం)ఓట్ల తేడాతోనే అధికారాన్ని కోల్పోయి ప్రధాన ప్రతిపక్ష పాత్ర నిర్వహిస్తున్న వైసీపీ పార్టీకి వంద సీట్లు రావడంతో అధికారాన్ని చేపడుతుందని తేలింది.

గత నాలుగు ఏండ్లుగా టీడీపీ సర్కారు అవినీతిపై పోరాడటమే కాకుండా ప్రజల సమస్యలపై అలుపు ఎరగని పోరాటం చేస్తూ ..మరోవైపు విభజన హామీలపై ముఖ్యంగా ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ఫ్యాకేజీ ముద్దని చెప్పిన చంద్రబాబు నోటి చేత ప్రత్యేక హోదానే కావాలి ..అందుకు ఎంతదాకా అయిన పోరాడతామని కేంద్రం మీద అవిశ్వాస తీర్మానం పెట్టేలా పోరాడిన వైసీపీ పార్టీ పట్ల ప్రజల్లో నెలకొన్న సానుకూలత ..ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకతతో వైసీపీ విజయానికి అడ్డు అదుపు లేకుండా పోయిందని ఈ సర్వేలో తేలినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.అయితే ఇటివల ఉగాది నాడు జగన్ పన్నెండు సవంత్సరాలకు పైగా ముఖ్యమంత్రిగా ఉంటారు ..దాదాపు నూట ముప్పై ఐదు స్థానాలను గెలుచుకుంటారు ..అలా జరక్కపోతే భవిష్యత్తులో జాతకం చెప్పను అని పండితులు తేల్చి చెప్పిన నేపథ్యంలో ఈ వార్త నిజమే కావచ్చని ఇటు రాజకీయ వర్గాలు అటు విశ్లేషకులు భావిస్తున్నారు ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat