గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి ఆ తర్వాత అధికార టీడీపీలో చేరిన ఎంపీ కొత్తపల్లి గీత ప్రాణానికి హాని ఉందని ఆమె దేశ రాజధాని ఢిల్లీ నగర పోలీసులకు పిర్యాదు చేశారు.ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ ఢిల్లీలో కొంతమంది గుర్తు తెలియని నెంబర్ల నుండి కాల్స్ చేసి బెదిరిస్తున్నారు.
నేను లోక్ సభకు హాజరుకాకుండా ఉండాలని ..లేకపోతే దాడికి పాల్పడతామని వార్రు బెదిరిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.అయితే ప్రస్తుతం కేంద్ర సర్కారు మీద అవిశ్వాస తీర్మానంపై టీడీపీ,వైసీపీ పార్టీ నాయకత్వం తమ పార్టీకి చెందిన ఎంపీలు అందరూ పార్లమెంటు సమావేశాలు ముగిసేవరకు క్రమం తప్పకుండ హాజరు కావాలని విప్ జారీచేసిన సంగతి విదితమే..