ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు నిజాలను వెలుగులోకి తెచ్చారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. కాగా, సీఎం చంద్రబాబు నాయుడు తన రాజకీయ ప్రస్థానం 40 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో పలు మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తూ నాడు ఇందిరాగాంధీకి చెప్పి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పించానంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అలాగే, ఇటీవల అసెంబ్లీలో మాట్లాడుతూ.. నాడు ఇందిరా గాంధీని రాజకీయంగా ఎదుర్కొన్న ఘనత ఒక్క టీడీపీకే చెందుతుందని, ఆ సమయంలో తానే(చంద్రబాబు) ఇందిరాగాంధీపై యుద్ధం ప్రకటించానంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు అసెంబ్లీలోని టీడీపీ ఎమ్మెల్యేలంతా బల్లలు చరుస్తూ హర్షాతిరేఖాలు వ్యక్తం చేశారు కూడాను.
see also : ఎంపీ కొత్తపల్లి గీతకు ప్రాణహాని..!
అయితే, చంద్రబాబు నిజంగానే ఇందిరాగాంధీని ఎదుర్కొన్నారా..? వైఎస్ఆర్‌కు టిక్కెట్ ఇప్పించింది చంద్రబాబేనా..? అన్న ప్రశ్నలకు అప్పటి రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన ఉండవల్లి అరుణ్‌కుమార్ సంచలన నిజాలు చెప్పారు. ఇందిరాగాంధీని టీడీపీ ఎదుర్కొన్నప్పుడు చంద్రబాబు టీడీపీ పార్టీలోనే ఉన్నారని, కాంగ్రెస్‌లోనే ఉంటూ ఇందిరాగాంధీని ఎలా ఎదుర్కొన్నారంటూ చంద్రబాబును ప్రశ్నించారు ఉండవల్లి. ఇక రాజశేఖర్‌రెడ్డికి ఎమ్మెల్యే టిక్కెట్ తానే ఇప్పించానంటూ చంద్రబాబు డప్పుకొట్టకోవడాన్ని ఉండవల్లి తప్పుబట్టారు. రాజశేఖర్‌రెడ్డి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచింది రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆవుదూడ గుర్తుమీదని గుర్తు చేశారు ఉండవల్లి అరుణ్‌కుమార్. నా రాజకీయ చరిత్ర 40 ఏళ్లు, నేను ఏం చెప్పినా నమ్ముతారులే అనుకోవడం తప్పు అంటూ చంద్రబాబుకు చురకలంటించారు ఉండవల్లి అరుణ్‌కుమార్.
see also :