పోలవరం ప్రాజెక్టు. ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా అభివర్ణిస్తున్న ఈ ప్రాజెక్టును మేమే నిర్మించుకుంటామంటూ 2014లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర పెద్దలను ఒప్పించి మరీ బాధ్యతలు తీసుకున్నారు. అంతేకాకుండా 2018కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి ఏపీ ప్రజలకు నీటి సమస్య లేకుండా చేస్తామని ప్రగల్బాలు కూడా పలికారు. అయితే, ఇప్పటికీ కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తి నిర్మాణానికి నోచుకోకపోవం విచారకరం. అయితే, 2014 ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటిన ఉంచి, ఇప్పటికీ టీడీపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు వచ్చాయి.. వస్తూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుపై వచ్చినన్ని అవినీతి ఆరోపణలు దేశంలోని ఏ ముఖ్యమంత్రిపై వచ్చి ఉండవన్నది రాజకీయ విశ్లేషకుల మాట.
see also : ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలోస్తే ఎవరికెన్ని..!
అయితే, చంద్రబాబుపై వచ్చిన అవినీతి ఆరోపణలు నిజమేనంటూ ఇటీవల కాగ్ విడుదల చేసిన నివేదిక తేల్చేసింది. అందులో పోలవరం ప్రాజెక్టులో టీడీపీ అవినీతి భారీ స్థాయిలోనే ఉందన్నది కాగ్ విడుదల చేసిన నివేదిక చెప్తున్నమాట.
కాగ్ విడుదల చేసిన నివేదిక పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు ప్రభుత్వం అవినీతిని లెక్కలతో సహా వివరించింది. అయితే, కాగా తేల్చిన చంద్రబాబు సర్కార్ అవినీతిని లెక్కలతో సహా మీ కోసం..!!
1) ముంపు గ్రామాలు, జీలుగుమల్లి మండలం రాచన్నగూడెం తట్టి రామన్నగూడెం గిరిజనులకు చెందాల్సిన నిధులను టీడీపీ నేతలు తినేశారు. ఆ నిధుల విలువ రూ.20కోట్లు.
2) డంపింగ్ కోసమని రైతుల దగ్గర తీసుకున్న పొలాలకు చెల్లించాల్సిన నిధును కూడా టీడీపీ నేతలు, దళారులు కుమ్మక్కై తినేశారు. ఆ నిధుల విలువ రూ.20 కోట్లు
3) తాడ్వాయి, చల్లవారిగూడెం ఇళ్ల స్థలాలకోసమని తీసుకున్న 1300 ఎకరాల దేవాదాయశాఖ, పోరంబోకు భూములు విలువను కూడా ప్యాకేజీలో పెట్టి, కాంపెన్షేషన్ ఇచ్చి, నిధులను బొక్కేశారని కాగ్ నివేదిక వెల్లడించింది.
4) అలాగే, వేలేరుపాడు, గుక్కునూరు మండలాల్లో పాత సర్వే నెంబర్లను పెట్టి అనర్హులకు (టీడీపీ నేతల)కు కూడా ఇళ్లు కట్టించి, ఆ నిధులను కూడా ప్యాకేజీలో కలిపేశారని కాగ్ నివేదిక తేల్చేసింది.
see also : టీడీపీ నేతకు.. జైల్లో ఉన్న ఫొటోను పోస్ట్ చేసిన సంపూర్ణేష్ బాబు..ఎందుకో తెలుసా
5)గణపవర గద్దేవారికి సంబంధించిన పొలాల రికార్డులు లేకపోయినా… సీఆర్డీఏ కమిషనర్ వాటిని రికార్డుల్లో పెట్టి డబ్బులు తీసుకున్నారని,
దొరమామిడి, బుట్టాయగూడెం, గణపవరం ప్యాకేజీల నిమిత్తం 4వేల గజాల స్థలాన్ని సీఆర్డీఏ కమిషనర్ కోసం నరసారావుపేటలో కొనిపెట్టారని, అందులో ఐటీడీఏ పీవోకు రూ.7 కోట్లు ముట్టాయని సీఆర్డీఏ తేల్చింది.
6) కొయ్యలగూడెం, బుట్టాయగూడెం మండలాల్లో సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీరు – చెట్టు కార్యక్రమం పేరుతో సుమారు వంద కోట్లు తినేశారని,
7) నెల్లూరు జిల్లాలో నీరు చెట్టు కార్యక్రమం పేరుతో రూ.500 కోట్లు ప్రభుత్వం కాజేసినట్లు కాగ్ నివేదిక తేల్చింది.
ఏపీ అభివృద్ధి కోసమంటూ పలు బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పును సీఎం చంద్రబాబు నాయుడు తన అనుచవర్గంతో కలిసి విదేశాలకు తరలించారని, అంతేకాకుండా, విలువ మొత్తం రూ.1,25,0000 కోట్లు అంటూ సోషల్ మీడియా బల్లగుద్దిమరీ చెబుతోంది. అయితే, ఈ విషయాన్ని కేవలం సోషల్ మీడియానే కాకుండా, గురువారం వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పార్లమెంట్ వేదికగా మీడియా సాక్షిగా వెల్లడించారు. చంద్రబాబు అండ్ కో ఏపీ అభివృద్ధి కోసం తీసుకున్న నగదులో కొంత రూ.1,25,0000 కోట్లును విదేశాలకు హవాలా చేశారని చెప్పారు విజయసాయిరెడ్డి. ఏదేమైనా ఇటీవల కాలంలో సీఎం చంద్రబాబు ఏపీ అభివృద్ధిపేరిట భారీ అవినీతికి పాల్పడ్డారని ఇటు సోషల్ మీడియాతోపాటు, అటు రాజకీయ నాయకులు చెబుతుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో బీజేపీతో రాజీ చేసుకునేందుకు చంద్రబాబు తన పార్టీ నేతలను మోడీ వద్దకు పంపించారని సమాచారం.
see also :