ఆంధ్ర ప్రదేశ్ విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకహోదా కోసం మహోద్యమమే జరుగుతోంది. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని ప్రజలు కోరుతున్నాఅరు .తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ విశాఖలో విద్యార్ధులు భారీ ర్యాలీ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వాన్ని ‘నిలదీద్దాం- ప్రత్యేక హోదా సాదిద్దాం’ అనే నినాదంతో జన జాగరణ సమితి ఆధ్వర్యంలో విద్యార్ధులంతా ఫ్లకార్డులు పట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. ఆశీల్‌మెట్ట సంపత్ వినాయగర్ ఆలయం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకూ సాగింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తేనే విద్యార్ధి, యువతకు బంగారు భవిష్యత్తు ఉంటుందని జనజాగరణ సమితి నాయకులు అన్నారు. దీనిపై కేంద్రం తక్షణమే ప్రకటన చేయకపోతే భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలను చేస్తామని వారు హెచ్చరించారు.
