టీడీపీ, ప్రస్తుత ఏపీ ప్రభుత్వం. 2014 ఎన్నికల్లో ఏపీలో అధికార పగ్గాలు చేపట్టిన పార్టీ. అయితే, గత సాధారణ ఎన్నికల్లో అమలు కాని హామీలని తెలిసినా.. వెన్నుపోటు రాజకీయాల్లో రాటుదేలిన చంద్రబాబు కుట్రపూరితంగా ప్రజలను వంచించి 2014లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని యావత్ ప్రపంచం కోడై కూసిన విషయం తెలిసిందే. టీడీపీ అలా అధికారం చేపట్టిందో..! లేదో..! అప్పట్నుంచి.. ఇప్పటి వరకు తమకు ఎదురొచ్చిన ప్రతిపక్ష పార్టీల నేతలపై దాడులు కొనసాగిస్తోంది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు టీడీపీ నేతల దాడులకు గురైన బాధితులే. కొందరు టీడీపీ నేతలైతే ఒక అడుగు ముందుకేసి మహిళలపై సైతం దాడులకు పాల్పడ్డారు. ఏపీ రాజధాని అమరావతి కేంద్రంగా టీడీపీ నేతలు కొనసాగించిన హత్యలు, సెక్స్ రాకెట్, కాల్ మనీ సంఘటనలే ఇందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.
see also : ”పవన్ కల్యాణ్‌తో పెళ్లి”పై క్లారిటీ ఇచ్చిన శ్రీరెడ్డి..!!
see also : తెలంగాణ బీజేపీకి షాక్ ..!
ఇక అసలు విషయానికొస్తే.. 2015 సంవత్సరం ప్రారంభంలో ఓ ప్రముఖ పత్రికకు చెందిన, చిలకలూరిపేటకు చెందిన జర్నలిస్టు శంకర్ హత్య కేసులో నాడు టీడీపీ నేతలు పాత్ర ఉందంటూ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ ఆరోపణలనే చిలకలూరిపేట ప్రజలు నిర్ధారించారు. అంతటితో ఆగక మరో జర్నలిస్టు సురేంద్రను సైతం హత్య చేసేందుకు టీడీపీ కుట్ర పన్నిందని, కాకపోతే, టీడీపీ కుట్రలను గమనించిన సురేంద్ర, అధికార పార్టీ నేతల తీరును గమనించి నడుచుకోవడంతో, సురేంద్రపై ఎస్సీ, ఎస్టీ కేసుపెట్టి సరిపెట్టుకున్నారన్నది చిలకలూరిపేట ప్రజల సమాచారం.
ఇంతకీ చిలకలూరిపేట జర్నలిస్టు శేఖర్‌ను హత్య చేయాల్సిన అవసరం అవసరం టీడీపీ నేతలకు ఎందుకొచ్చింది..? ఈ ప్రశ్న వెనక భారీ అక్రమ వ్యవహారాలే ఉన్నాయి. అవేమిటంటే. ఏపీ ప్రజల వద్ద కోట్లలో నగదు వసూలు చేసి చివరకు బోర్డు తిప్పేసిన అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన భూములను మంత్రి పత్తిపాటి పుల్లారావు కారచౌక ధరకు కొనుగోలు చేసి తన భార్య పేరు మీద రిజిస్ర్టేషన్ చేయించారని, ఈ వాస్తవాన్ని ఓ ప్రముఖ పత్రిక ద్వారా వెలుగులోకి తెచ్చాడు జర్నలిస్టు శంకర్. దీంతో జర్నలిస్టు శంకర్‌పై పగపెంచుకున్న మంత్రి పత్తిపాటి పుల్లారావు తన అనుచరవర్గంతో ప్లాన్‌వేసి మరీ శంకర్‌ను హత్య చేయించారన్నది చిలకలూరిపేట వాసుల మాట.
టీడీపీ హత్యలు అంతటితో ఆగలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టాక 16 మందిని టీడీపీ గూండాలు హత్య చేశారు. అందులో ఒకటి పత్తికొండ నియోజకవర్గం వైసీపీ నాయకుడు చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య. ఈ హత్య కేసులో ఇప్పటికీ ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యాంబాబును పోలీసులు నిందితుడుగా పేర్కొనడమే కాకుండా.. కోర్టు అరెస్టు వారెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే.
మరో హత్యకు టీడీపీ కుట్ర..!!
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం శ్రీరామవరానికి చెందిన వైసీపీ కార్యకర్త కొత్తపల్లి రమేష్‌ను హత్య చేసేందుకు స్థానిక టీడీపీ ఎంపీటీసీ శోభన్ బాబు సిద్ధపడిన విషయం తెలిసిందే. తనవల్ల కాకపోవడంతో స్థానికంగా ఉండే రౌడీ షీటర్ బ్రహ్మానందంతో సుఫారీ ఇచ్చి మరీ వైసీపీ కార్యకర్త కొత్తపల్లి రమేష్‌ను హత్య చేయించేందుకు ప్రణాళిక రచించాడు. వైసీపీ కార్యకర్త కొత్తపల్లి రమేష్‌ను హత్య చేయించేందుకు రూ.లక్ష రూపాయలకు గానూ రూ.25వేలు అడ్వాన్స్ కూడా ముట్ట చెప్పారు శోభన్ బాబు. అయితే, ఇలా హత్య చేసేందుకు ఒప్పుకున్న బ్రహ్మానందం కారణంగానే ఈ విషయం తెరమీదకు వచ్చింది. ముందుగా హత్య చేసేందుకు అంగీకరించిన బ్రహ్మానందం ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ ఆలోచనను విరమించుకున్నాడు. కుట్ర పన్నిన విషయాన్ని రౌడీ షీటర్ బ్రహ్మానందం వెనక్కు తగ్గిన ఉదంతం వైసీపీ నేత రమేష్ చెవిన పడటంతో రమేష్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఆ కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది.
ఈ దాడులు ఆగే వరకు ఏపీలోని ప్రతీ ఒక్కరికి ఈ విషయం చేరువయ్యేలా తెలియజేయండి..!!
see also :