తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీపై ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ,ఎంపీ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పిర్యాదు చేశారు.అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ నిన్న మీడియాతో మాట్లాడుతూ సినిమావాళ్ళు ఏసీ రూమ్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు.
ఒకపక్క నానా కష్టాలు పడుతున్న ఐదు కోట్ల ఆంధ్రులను చూసి అయిన చలించడంలేదని ఆయన తీవ్ర విమర్శలు చేశారు.రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ సీనియర్ నటుడు ,ఎంపీ మురళి మోహన్ చంద్రబాబు నాయుడుకు పిర్యాదు చేశారు .
ఈ క్రమంలో చంద్రబాబుతో మెజార్టీ నటులందరూ ఏపీ కోసం పాటుపడుతున్నారు.స్పెషల్ స్టేటస్ కోసం కొట్లాడుతుంటే గతంలోనే మన ప్రభుత్వం వాళ్ళ మీద కేసులు పెట్టింది .ఇప్పుడు ఎమ్మెల్సీ అలా మాట్లాడటం కరెక్ట్ కాదు.దీనివలన పార్టీకి నష్టమే కానీ లాభం ఉండదు అని ఆయన వాపోయారు అంట ..