కొండ నాలుక్కి ఉప్పేస్తే ఉన్న నాలుక ఊడినట్లు ఉంది ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ప్రస్తుత వ్యవహారం ..గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన నయానో ..భయానో ..నోట్ల కట్టలు ఆశచూపో..ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను ముగ్గురు ఎంపీలను చేర్చుకున్నాడు చంద్రబాబు.ఇప్పుడు అదే బాబుకు కష్టాలను తెచ్చి పెట్టింది.ఫిరాయింపుల ప్రోత్సాహంలో భాగంగా చంద్రబాబు వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిను టీడీపీలో చేర్చుకున్నాడు.అక్కడితో ఆగకుండా ఏకంగా మంత్రి పదవిచ్చి ఘనంగా సత్కరించాడు.
అంతవరకూ బాగానే ఉంది కానీ వైసీపీ నుండి వచ్చిన నేతలను అందలం ఎక్కిస్తూ కష్టకాలంలో అన్ని విధాలుగా పార్టీకి అండగా ఉంటూ ..అధికారం ఉన్న లేకపోయిన కానీ పార్టీను అంటిపెట్టుకున్నవారికి మొండి చేయి చూపుతున్నారు.అందులో భాగంగా గత నాలుగు ఏండ్లుగా పలు అవమానాలను ఎదుర్కుంటున్న వారి జాబితా ఎక్కువే ఉంది.వీరి జాబితాలో ఒకరు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి.అయితే వైఎస్ హయం నుండి నేటి జగన్ వరకు టీడీపీ పార్టీ జమ్మలమడుగులో ఉందంటే దానికి ఏకైక కారణం రామసుబ్బారెడ్డి.గత ఎన్నికల్లో జగన్ దాటికి నిలవలేకపోయాడు .కానీ రానున్న ఎన్నికల్లో కూడా చంద్రబాబు ఆదినారాయణ రెడ్డికే సీటు ఇస్తాను ..
అందుకే ఎమ్మెల్సీ ఇస్తున్నాను అని తేల్చి చెప్పాడు చంద్రబాబు.కానీ గత నాలుగు ఏళ్ళుగా టీడీపీ సర్కారు అవినీతి అరాచక పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండటమే కాకుండా స్థానికంగా మంత్రి ఆదినారాయణ రెడ్డిపై ఉన్న వ్యతిరేకతతో ఒక్క కడప జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఓడిపోవడం ఖాయమని సర్వేలు తేల్చి చెబుతున్నాయి.ఈ నేపథ్యంలో ఇప్పటికే పార్టీలో సరైన ప్రాధాన్యత లేకపోవడం ..రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాకపోవడం ఇలా పలు అంశాలను పరిగణలోకి తీసుకున్న ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు జిల్లా రాజకీయ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.అంతే కాకుండా చంద్రబాబు పొమ్మనలేక పొగ బెడుతున్నారని కూడా రామసుబ్బారెడ్డి అనుచవర్గం ఆలోచనలో పడ్డారు.అందుకే రానున్న ఎన్నికల్లోపు ఆయన తన అనుచవర్గంతో సహా పార్టీ మారడం ఖాయం అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ..