Home / ANDHRAPRADESH / ఏపీ అధికార పార్టీ నేత‌ల‌పై శ్రీ‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

ఏపీ అధికార పార్టీ నేత‌ల‌పై శ్రీ‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

ఏపీ అధికార పార్టీ నేత‌ల‌పై ప్ర‌ముఖ న‌టి శ్రీ‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!! అవును, ప్ర‌ముఖులు, రాజ‌కీయ నేత‌లు సినిమాల్లో అవ‌కాశాలు ఇప్పిస్తామంటూ హీరోయిన్ల‌ను వాడుకున్నార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది న‌టి శ్రీ‌రెడ్డి. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఉన్న నిర్మాత‌లంతా నిజ‌మైన వారు కాద‌ని, వారు రాజ‌కీయ నాయ‌కుల బినామీల‌ని చెప్పింది. రాజ‌కీయ నాయ‌కుల‌కు బినామీలుగా ఉంటూ సినిమాలు నిర్మించే వ్య‌క్తులు టాలీవుడ్‌లో కోకొల్ల‌లుగా ఉన్నార‌ని, వారంతా సినిమాల్లో అవ‌కాశాలు ఇప్పిస్తామ‌ని చెప్పి ప‌లువురు మ‌హిళ‌ల‌ను రాజ‌కీయ నేత‌ల వ‌ద్ద‌కు పంపించార‌ని, వారిలో నేనూ ఉన్నానంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది శ్రీ‌రెడ్డి.

see also : హైదరాబాద్ లోని మాదాపూర్ లో భారీ అగ్ని ప్రమాదం..150 గుడిసెలు దగ్ధం..!

కాగా, ఇవాళ ఓ మీడియా ఛానెల్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చిన శ్రీ‌రెడ్డి ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. అయితే, మీరు ఇలా అన్ని విష‌యాలు బ‌హిరంగంగా చెబుతున్నారు క‌దా..? ఎవ‌రి నుంచైనా నీకు బెదిరింపులు వ‌చ్చాయా అని ఇంట‌ర్వ్యూ చేసే యాంక‌ర్ అడుగ‌గా, నేను అన్నింటికి తెగించే ఈ విష‌యాల‌న్నింటిని బ‌య‌ట‌పెడుతున్నానంటూ స‌మాధానం ఇచ్చింది శ్రీ‌రెడ్డి. ఇలా ఎవ‌రైనా ఓపెన్ అయిన‌ప్పుడు వారికి బెదిరింపులు రావ‌డం స‌హ‌జం. ఏదేమైనా మీరు అడిగారు కాబ‌ట్టి చెబుతున్నా, ఇటీవ‌ల కాలంలో ఇటు టాలీవుడ్ నుంచి సినీ న‌టులు, అటు ఏపీ నుంచి రాజ‌కీయ నాయ‌కులు చాలా మంది ఫోన్ చేసి బెదిరింపుల‌కు పాల్ప‌డ్డారు. వారిలో ఏపీకి చెందిన ఓ అధికార పార్టీ నేత కూడా ఉన్న‌ట్లు చెప్పుకొచ్చింది శ్రీ‌రెడ్డి. అత‌ను కూడా నా క‌స్ట‌మ‌రే అంటూ ఓపెన్‌గా చెప్పేసింది శ్రీ‌రెడ్డి. అయితే, ఆ వ్య‌క్తి పేరేమిటో చెప్పొచ్చు క‌దా..!! అని యాంక‌ర్ అడ‌గ్గా.. ఆ స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు అంద‌రి పేర్లు బ‌య‌ట పెడ‌తానంటూ స‌మాధానం ఇచ్చింది. ఏదేమైనా ఇప్ప‌టికే ప్ర‌త్యేక హోదాపై పోరాటాల‌తో అట్టుడుగుతున్న ఏపీ, శ్రీ‌రెడ్డి చేసిన తాజా వ్యాఖ్య‌లు రాజ‌కీయ నాయ‌కుల్లో ఓ సంచ‌ల‌నం రేప‌నుంది.

see also :

ఎల్లో మీడియాను చెంపమీద కొట్టే ఆర్టికల్..! ఒక్కో షేర్‌తో.. ఒక్కో చెప్పుదెబ్బ‌..!!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat