తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీలో అప్పుడే గందరగోళం మొదలైంది.ఇప్పటికే ఆ పార్టీకి చెందిన రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ప్రస్తుత అధ్యక్షుడు కే లక్ష్మణ్ వరకు నేతలందరూ రానున్న ఎన్నికల్లో అమిత్ షా నాయకత్వంలో ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి తీరుతాం అని బీరాలు పలుకుతున్న సంగతి మనం
చూస్తూనే ఉన్నాం.
తాజాగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి గుడ్ బై చెప్పారు.పార్టీకోసం అహర్నిశలు కష్టపడుతున్న కానీ తనకు పార్టీ నుండి ఎటువంటి సహాయసహకారాలు అందటంలేదని ఆయన వాపోయారు.తన రాజీనామా లేఖను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కు మెయిల్ పంపారు.అయితే తను ఏ పార్టీలో చేరబోతున్నారో త్వరలో చెప్తా అని మీడియాకు తెలిపారు ..